amp pages | Sakshi

టీడీపీ నేత పొలం.. ప్రజలకు శాపం

Published on Fri, 11/02/2018 - 11:26

నరసరావుపేటరూరల్‌: నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు వేళ్లే రోడ్లు అధ్వానంగా ఉంటే కేఎం అగ్రహారానికి మాత్రం కోట్లాది రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఉపాధి హామీ నిధులతో నియోజకవర్గంలోని శ్మశాన వాటికలను అభివృద్ధి జరుగుతుంటే కేఎం అగ్రహారానికి మాత్రం అధికార గ్రహణం పట్టింది. దీనికి కారణం టీడీపీ నేతకు చెందిన భూములు శ్మశాన వాటిక పక్కన ఉండటమే.

శ్మశాన అభివృద్ధి అటకెక్కింది
కేఎం అగ్రహారంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ శ్మశాన వాటికల పనులను కొంతకాలం క్రితం ప్రారంభించారు. దాదాపు 90 సెంట్లలో ఉన్న శ్మశాన వాటికలోని పిచ్చిమొక్కలను తొలగించారు. శ్మశాన వాటికలోకి వచ్చేందుకు డ్రెయిన్‌పై బ్రిడ్జి కూడా నిర్మించారు. చుట్టూ ప్రహరీ పిల్లర్లు వేశారు. ఆ పనులను గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ అర్ధంతరంగా నిలిపివేశారు. కొద్ది నెలలుగా ఈ పనులు ముందుకు కదలటం లేదు.

పనులకు టీడీపీ నేత బ్రేక్‌
గ్రామంలోని శ్మశాన వాటికల అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి టీడీపీ నేత కారణమని తెలుస్తోంది. శ్మశానవాటిక పక్కనే అధికార పార్టీ నేతకు చెందిన సుమారు 40 ఎకరాల భూమి ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేత ఈ భూములను కొనుగోలు చేశారు. శ్మశాన వాటిక అభివృద్ధి చేస్తే తన భూముల విలువకు నష్టం వస్తుందని భావించిన టీడీపీ నేత పనులను నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ పనులను ఆపేశాడు.

అధికార పార్టీ నేత భూముల కోసం రోడ్లు
టీడీపీ నేత కేఎం అగ్రహారంలో భూములు కొనుగోలు చేసిన తరువాత గ్రామానికి వచ్చే రోడ్లకు మహర్దశ పట్టింది. సాతులూరు నుంచి నకరికల్లు వరకు ఉన్న లింక్‌ రోడ్డును నకరికల్లు, నరసరావుపేట మండలంలోని పలు గ్రామాలకు కలుపుతూ ప్రధానిగా వాజ్‌పేయ్‌ ఉన్న కాలంలో నిర్మించారు. ఈ రోడ్డు విస్తరణ పనులకు 2016లో రూ.20 కోట్లతో చేపట్టారు. పమిడిపాడు మీదగా వెళ్లే ఈ రోడ్డును టీడీపీ నేత భూములు కొనుగోలు చేసిన కేఎం అగ్రహారానికి మళ్లించారు.

భూములు పక్కగా మరో రోడ్డు
టీడీపీ నేత భూములు పక్కన మరో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కేఎం అగ్రహారం నుంచి ఇస్సప్పాలెం పంట పొలాల మధ్య నుంచి వెళ్లే డొంక రోడ్డును బీటీ రోడ్డుగా మార్చుతున్నారు. నాలుగు కి.మీ వరకు ఉండే ఈ రోడ్డు కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం కల్వర్టుల నిర్మాణం పనులు జరుగుతున్నాయి.

సర్వత్రా విమర్శలు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేత తన ఆర్థిక వనరులు పెంచుకునేందుకు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నారు. గోతులమయంగా మారిన రోడ్లతో తాము ఇబ్బందులు పడుతుంటే తన భూముల కోసం నూతనంగా రోడ్లు నిర్మించుకోవడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని శ్మశాన వాటికకు మోక్షం కలిగిందని నరసరావుపేట మండలం కేఎం అగ్రహారం గ్రామస్తులు సంబరపడ్డారు. ముళ్ల చెట్లు తొలగించి, బ్రిడ్జి నిర్మించి, పిల్లర్లు వేస్తే ఎన్నాళ్లకెళ్లాకని ఆనందించారు. వీరి సంబరం ఎక్కువ కాలం నిలవలేదు. చేస్తున్న పనులను అధికారులు అర్ధంతంగా ఆపేశారు. అనుమతులొచ్చినా.. నిధులున్నా పనులు ఎందుకు ఆపారా ? అని ఆరా తీస్తే.. టీడీపీ నేత భూములు శ్మశాన వాటిక పక్కన ఉండడమే కారణమని తెలిసి కంగుతిన్నారు. శ్మశానం అభివృద్ధి చెందితే భూముల ధరలు పడిపోతాయని ఇలా చేసినట్లు గుర్తించారు. ఇదే సమయంలో టీడీపీ నేత పొలాలకు వెళ్లేందుకు రోడ్లు నిర్మిస్తున్న అధికారుల తీరు చూసి ఇదెక్కడి న్యాయమంటూ మండి పడుతున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)