amp pages | Sakshi

వలస కూలీలపై కరోనా పంజా

Published on Sun, 05/17/2020 - 09:37

సాక్షి, శ్రీకాకుళం: వలస కూలీలపై కరోనా పంజా విసిరింది. సుదూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చామని ఆనందపడ్డ వారికి అంతలోనే కష్టమొచ్చింది. చెన్నై నుంచి వచ్చిన వారి పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం ఒకటితో ప్రారంభం కాగా తాజాగా 19 నమోదై మొత్తం 20కి చేరినట్టు సమాచారం. వీరిలో మత్స్యకారులు, ఇతరత్రా కూలీలు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఎచ్చెర్ల, శ్రీకాకుళం, సరుబుజ్జిలి మండలాల్లోని క్వారంటైన్‌లో ఉండటంతో జిల్లావాసులకు ఎటువంటి ముప్పు లేదు. మొదట విదేశాల నుంచి వచ్చిన వారితో ఆందోళన నెలకొంది. ఆ తర్వాత ఢిల్లీ వారితో వణుకు.. అనంతరం గుజరాత్, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారితో ముప్పు వస్తుందేమోనని భయం.. మధ్యలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల నుంచి వచ్చిన వారి గురించి ఆందోళన చెందినా వారి వలన పెద్దగా ముప్పు లేకుండా పోయింది. ప్రస్తు తం చెన్నై వణుకు పుట్టిస్తోంది. అక్కడి నుంచి బస్సుల ద్వారా, శ్రామిక్‌ రైలు ద్వారా వచ్చిన వారిలో పలువురికి కరోనా లక్షణాలు కన్పిస్తున్నాయి. 

తాజాగా నమోదైన 19 కేసుల్లో 10మంది మహిళలే..! 
కొత్తగా నమోదైన 19 కేసుల్లో 10మంది మహిళలు ఉన్నట్టు తెలిసింది. వీరంతా ప్రత్యేక బస్సులు, శ్రామిక్‌ రైలు ద్వారా జిల్లాకు చేరుకున్నారు. వచ్చిన వారందరినీ అధికారులు ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్‌లో పెట్టడంతో జిల్లాలో వైరస్‌ వ్యాప్తి చెందడానికి అవకాశం లేకుండా పోయింది. చెన్నైలో ముఖ్యంగా కోయంబేడు మార్కెట్‌ ద్వారా వైరస్‌ ఎక్కువగా వ్యాపించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో అధికారులు అప్రమత్తమై పరీక్షలు వేగవంతం చేశారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో తాజాగా 19 పాజిటివ్‌ కేసులొచ్చాయి. వీరిలో 17మంది జెమ్స్‌ కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరికి టీబీ, ఆస్తమా ఉండటంతో విశాఖపట్నం విమ్స్‌ కోవిడ్‌ ఆసుపత్రికి పంపించినట్టు సమాచారం. 

తల్లికి పాజిటివ్‌.. బిడ్డ దూరం  
తాజాగా నమోదైన వారిలో మూడేళ్ల బిడ్డ గల తల్లికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిసింది. వెంటనే ఆమె బిడ్డకు, భర్తకు కూడా పరీక్షలు చేశారు. వారిద్దరికీ నెగిటివ్‌ వచ్చింది. దీంతో పాజిటివ్‌ వచ్చిన తల్లిని జెమ్స్‌ కోవిడ్‌ ఆసుపత్రిలో చేర్చగా, తండ్రి చెంతన బిడ్డను ఉంచి రిమ్స్‌ క్వారంటైన్‌లో పర్యవేక్షిస్తున్నారు.     

ఎలాగైనా సొంతూరు చేరాలి..
రోజురోజుకు నీరసించిపోతూ.. అడుగులు ముందుకు పడని స్థితిలో.. ప్రమాదకరమని తెలిసినా వలస కార్మికులు ఇలా లారీలను ఆశ్రయిస్తున్నారు.  –రణస్థలం 
                    

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌