amp pages | Sakshi

పరిహారం..పరిహాసం

Published on Mon, 03/26/2018 - 11:43

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వరుస కరువులతో జిల్లా యంత్రాంగం తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్, రబీ పంట నష్టం అంచనాలను అధికారులు మొక్కుబడిగా ప్రభుత్వానికి నివేదించగా ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు. దీంతో జిల్లా రైతాంగం మరింత ఆందోళన చెందుతోంది. జూన్‌ ఒకటినుంచి మే 31 వరకు  ఈ ఏడాది సాధారణ వర్షపాతం 871.5 ఎంఎం కాగా గత జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు కేవలం 385.2 ఎంఎం వర్షపాతమే నమోదైంది. రబీలో 43.5 శాతం మాత్రమే వర్షపాతం నమోదైంది. జనవరి నుంచి చినుకు లేదు. చెరువులు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయాయి. పశ్చిమ ప్రాంతంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పశువులకు మేత, దప్పిక తీరే దారిలేని పరిస్థితి ఉంది. మొత్తంగా 88 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగైన పంటలు ఆదిలోనే ఎండిపోయాయి. అరకొరగా పండినా దిగుబడులు తగ్గాయి. గిట్టుబాటు ధరల్లేకపోవడంతో సగం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దీంతో జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది.

జిల్లాలో 14 లక్షల ఎకరాలకుపైగా సాగు భూమి ఉండగా ఖరీఫ్, రబీలో రైతులు 10 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, శనగ, మిర్చి పంటలు సాగు చేశారు. ఎకరాకు 30 వేలకు తగ్గకుండా పెట్టుబడులు పెట్టారు. ఇక కౌలు లెక్కలు సరేసరి. రైతులు ఎకరాల్లెక్కన పెట్టిన పెట్టుబడే రూ.3 వేల కోట్లు దాటింది. తీవ్ర వర్షాభావంతో ఇందులో 70 నుంచి 80 శాతం పంటలు చేతికి రాకుండా పోయాయి. ప్రధానంగా గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, మార్కాపురం తదితర పశ్చిమ ప్రకాశం ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోవాల్సి వచ్చింది. మొత్తంగా రైతులు రూ.2400 కోట్లు నష్టపోయారు. అయితే పంట నష్టం అంచనాలను గణించిన ప్రభుత్వ అధికారులు జిల్లాలోని కరువు కింద ప్రకటించిన 55 మండలాల పరిధిలో 1,23,233.58 హెక్టార్లలో అన్ని పంటలు దెబ్బతిన్నట్లు లెక్కలు తేల్చారు.

1,65,086 మంది రైతులకు రూ.125,60,36,502 చెల్లించాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అధికారిక లెక్కల ప్రకారమే ఇందులో ప్రధానంగా 50 వేల హెక్టార్లలో కంది, 25 వేల హెక్టార్లలో శనగతో పాటు పత్తి, మిర్చి తదితర పంటలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. వాస్తవానికి అధికారులు పేర్కొంటున్న 1.23 లక్షల హెక్టార్లలో కంది, మిర్చి, పత్తి, శనగ సాగుకు సైతం రైతులు రూ.863 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు  అంచనా. అయితే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించింది కేవలం రూ.125 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. వాస్తవానికి 8 లక్షల ఎకరాల్లో రైతుల పెట్టుబడులు రూ.2,400 కోట్లు ఉన్నాయి. కానీ అధికారులు అంచనాలకు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి ఏ మాత్రం పొంతన లేదు. మొక్కుబడిగా అధికారులిచ్చిన గణాంకాలను, దానికి సంబంధించిన పరిహారం ఇచ్చే పరిస్థితి కానరావడం లేదు.

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)