amp pages | Sakshi

దళారి చేతిలో అన్నదాత దగా

Published on Wed, 01/22/2014 - 04:13

దగదర్తి, న్యూస్‌లైన్: ఎకరాకు 4 పుట్ల ధాన్యం దిగుబడి ఇచ్చే భూములవి. సాగునీరు కూడా పుష్కలంగా వస్తోం ది. పైరుగా ఏపుగా పెరుగుతోంది. ఈ ఏడాది తమ పంట పండినట్టేనని రైతు లు భావించారు. ఇంతలో చిరుపొట్ట ద శకు చేరుకునే సమయంలో పైరు ఒక్కసారిగా గిటకబారసాగింది.
 
 వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన వరిపైరు గిటకబారి ఎండిపోతుండటంతో అన్నదాత లబోదిబోమంటున్నారు. దళారి నకిలీ విత్తనాలు అంటగట్టడంతోనే తాము ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. దగదర్తి మండలం పెదపుత్తేడు గ్రామంలోని రైతుల కష్టాలివి. సాధారణంగా ధాన్యం అమ్ముకునే సమయంలో దళారుల చేతిలో దగాపడే అన్నదాత సాగు మొదట్లోనే కోలుకోలేని దెబ్బతిన్నారు.
 
 రేణంగి కాంతమ్మకు భర్త లేరు. కుమారుడు కష్టపడి సంపాదిం చిన మొత్తంలో ఎక్కువ శాతం సేద్యానికే వెచ్చిస్తుంది. నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరిపంట సాగు చేస్తోంది. పైరు  ఎండిపోతుండటం, ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా  ఫలితం కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
 
 ఓజిలి శూలం
 మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట వేశాడు. అప్పులు తెచ్చి సాగుచేసిన పంట ఎండుముఖం పట్టడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు.
 
 షేక్ రహంతుల్లా
 ఆరెకరాల భూమిలో వరిసాగు చేస్తున్నారు. పంట ఎండుముఖం పట్టడంతో దిక్కుతోచని స్థితి ఎదుర్కొంటున్నాడు. దళారిని నమ్మడంతో నకిలీ విత్తనా లు అంటగట్టాడని, ఎండుతున్న పంట దున్నేందు కు తప్ప దేనికీ పనికిరాదని వాపోతున్నాడు.
 
 గెరికపాటి ఓబయ్య
 ఐదెకరాల భూమిని కౌ లుకు తీసుకు ని వరి సాగుచేశాడు. మంచి దిగుబడులు సాధించి అప్పులు తీర్చుకోవాలని భావించిన ఈయన కల కల్లయిం ది. ఏపుగా పెరిగిన వరి ఒక్కసారిగా గిటకబారిందని, నాసిరకమైన విత్తనాలు అంటగట్టి దళారి మోసం చేశాడని బోరుమంటున్నాడు.
 
 పంటలను పరిశీలిస్తా:  
 ప్రభుత్వ అనుమతి పొందిన దుకాణాల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయా లి. ఎండుతున్న వరిపంటను పరిశీ లించి అధికారులకు వివరిస్తాం. రసీదులు, విత్తనాలు ఇచ్చిన సంచులు ఉంటే దళారులపై తగిన చర్యలు తీసుకుంటాం.    
 - విజయభాస్కర్,
 వ్యవసాయాధికారి, దగదర్తి
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)