amp pages | Sakshi

జటిలంగా ‘శ్మశాన వివాదం’

Published on Sat, 07/22/2017 - 07:36

∙పుష్కరఘాట్‌పై గుడిసెలు వేసేందుకు సిద్ధమైన గ్రామస్తులు
∙సానుకూలంగా పరిష్కరించుకోవాలంటూ అధికారుల బుజ్జగింపులు
∙అధికారులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం

రేపల్లె: పెనుమూడిలో శ్మశాన వాటిక సమస్య జఠిలంగా మారింది. కృష్ణా పుష్కరాలకు ముందు వరకు పుష్కరఘాట్‌ వద్ద దహన కార్యక్రమాలు నిర్వహించవద్దని వ్యతిరేకించిన వర్గం ఘాట్‌పైనే మృతదేహాలను దహనం చేసేందుకు సిద్ధమైంది. స్థానికుల కథనం ప్రకారం పుష్కరాల సమయంలో శ్మశనా వాటికను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. పుష్కరాల అనంతరం ఓ వర్గానికి చెందిన వ్యక్తి మృతి చెంది మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఇక్కడికి తీసుకువస్తే వేరే వర్గం ప్రజలు, అధికారులు ఇక్కడ దహనం చేసేందుకు వీలులేదంటూ వేరే ప్రాంతంలో దహనం చేసుకోవాలంటూ ఆదేశించారన్నారు. ఈ ప్రాంతం సమీపంలో ప్రజలు నివస్తున్నారన్న ఉద్దేశంతో మృతదేహాలు వేరే ప్రాంతంలో దహనం చేయడం జరిగుతోందని వివరించారు.


నాడు వద్దు అన్నవారు..
నాడు దహన కార్యక్రమాలు చేయరాదం టూ వివాదం చేసిన వారే ఇక్కడ దహన సంస్కారాలకు పాల్పడటం శోచనీయమన్నారు. ఈ ప్రాంతంలో మృతదేహాలను దహనం చేయడానికి వీలేదంటూ, దహనం చేస్తే శిక్షార్హులంటూ తహసీల్దార్‌ నోటీసు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని దిక్కరిస్తు మృతదేహం దహన ప్రక్రియలు నిర్వహించడంతో ఇబ్బందికర వాతా వరణం నెలకొల్పుతుందన్నారు. మృతదేహం దహనం చేస్తుంటే వాసన రావటంతో పాటు చితి నుంచి బూడిద గాలికి నివాసాల వైపు వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అనుమతి ఇచ్చారని, గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు సహాయంతో దహన సంస్కారాలకు పాల్పడటం దారుణమన్నారు.

టెంట్‌లు వేసి ఆందోళనకు దిగిన మహిళలు..
సమీపంలో ప్రజలు నివసిస్తూంటే ఇక్కడ దహన ప్రక్రియలు ఏ విధంగా నిర్వహిస్తారంటూ సమీపంలో నివసిస్తున్న ప్రజలు చిన్నపాటి గుడిసెలు వేసి నిరసన తెలిపారు. ఇక్కడ మేమంతా నివాసం ఉంటే మృతదేహాలను ఏవిధంగా దహ నం చేస్తారో చూస్తామని హెచ్చరించారు. దీంతో అధికారులకు, గ్రామస్తులకు వాగ్వాదం తలెత్తగా తహసీల్దార్‌ ఎస్‌వీ రమణకుమారి, సీఐ పెంచలరెడ్డి గ్రామస్తులను బుజ్జగించినప్పటికి ఫలితం లేకపోయింది. తహసీల్దార్, సీఐలు మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రానున్నారని అప్పటి వరకు గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని కోరారు.

Videos

జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)