amp pages | Sakshi

పట్టణాలలో డోర్‌ డెలివరీ

Published on Fri, 04/03/2020 - 11:20

సాక్షి కడప : జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లా కేంద్రమైన కడపలో  ఇప్పటికే కోర్, బఫర్‌ జోన్లుగా విభజించారు. ప్రజలను బయటకు రానీయకుండా గట్టి చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ఇతర పట్టణాల్లో కూడా జనం బయటికి రాకుండా నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయించాలని సంకల్పించింది.అన్ని మున్సిపాలిటీలతోపాటు పంచాయతీల్లో కూడా గుర్తింపు కలిగిన సూపర్‌ మార్కెట్ల ద్వారా డోర్‌ డెలివరీకి నడుం బిగించింది. ఆయా యాజమాన్యాలతో చర్చించింది. అవి కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయి. పేరొందిన సూపర్‌మార్కెట్ల ఫోన్‌ నెంబర్లు, వాట్సాప్‌ నెంబర్లను అధికారులు ప్రకటించారు.  సరుకులను ఎక్కువ ధరలకు అమ్మినా, తూకం తగ్గినా ఫిర్యాదులకు కూడా టోల్‌ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. పులివెందుల, బద్వేలు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఇలా అన్నిచోట్ల సూపర్‌మార్కెట్ల సమాచారాన్ని తెలియజేస్తున్నారు. మార్కెట్‌కు రాకుండా ఫోన్‌ ద్వారా  ఆర్డర్‌ ఇస్తే సరుకులు ఇంటికే వస్తాయి.

కడపలో ఐదు మొబైల్‌...మరో ఐదు తాత్కాలిక రైతు బజార్లు
కడపలో పలు సూపర్‌ మార్కెట్లను ఎంపిక చేసి డోర్‌ డెలివరీకి అవకాశం కల్పించింది. ఐదు మొబైల్‌ రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ఓం శాంతినగర్, ఆర్కే నగ ర్, ఇందిరానగర్, చెన్నూరు, ఊటుకూరు పరిధుల్లో కూ రగాయలకు సంబంధించిన మొబైల్‌ వాహనాలు తిరు గుతున్నాయి. ఫోన్‌ చేసిన క్షణమే నేరుగా ఇంటి వద్దకు వచ్చి అవసరమైన నిత్యావసరాలను అందిస్తున్నాయి. మరో ఐదు తాత్కాలిక రైతు బజార్లను కూడా ఏర్పాటు చేశారు. అంగడివీధిలోని పాఠశాల వద్ద, గురుకుల్‌ విద్యానికేతన్‌ వద్ద, ఐటీఐ సర్కిల్, జెడ్పీ ఆవరణం, గాంధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూలు ఆవరణంలో తాత్కాలికంగా రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా నేరుగా కూరగాయలు, నిత్యావసర సరుకులు డోర్‌ డెలివరీ తెప్పించుకోవడం ఉత్తమమార్గం.

డోర్‌ డెలివరీ ద్వారా తెప్పించుకోండి
డోర్‌ డెలివరీ చేసుకోండి. కమిటీ నిర్ణయించిన కంటే అధికంగా సరుకులు, కూరగాయల ధరలపై వసూలు చేస్తే టోల్‌ ఫ్రీ నెంబరు 1902కు ఫిర్యాదు చేయవచ్చు. డోర్‌ డెలివరీ  చేసినందుకు కొంతమేర అదనంగా వసూలు చేస్తారు. అంతేతప్ప అధిక ధరలు ఉండవు.– గౌతమి, జాయింట్‌ కలెక్టర్, కడప

కడపలో సూపర్‌ మార్కెట్లు సూపర్‌ బజారు పేరు    ఫోన్‌ నెంబరు
స్పెన్సర్‌                      75960 75488,99851 52277
విశాల్‌ మెగా మార్ట్‌         97055 27140,91823 00002,63027 03925
అను సూపర్‌ మార్కెట్‌    8142138300
కడప సూపర్‌ మార్కెట్‌    98663 48029
మోర్‌ సూపర్‌ మార్కెట్,హెచ్‌బీ కాలనీ    72078 42073
మోర్‌ సూపర్‌మార్కెట్,ఎన్జీఓ కాలనీ    97058 07181

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)