amp pages | Sakshi

తాగునీరు కలుషితం

Published on Thu, 06/14/2018 - 02:32

మల్కాపురం : యారాడ గ్రామంలోకి వచ్చే తాగునీటిని సేవించాలంటేనే గ్రామస్తులు ఆలోచించాల్సి వస్తోంది. పైపులైన్‌ ద్వారా వచ్చే నీటిని తాగితే ఎలాంటి రోగాలు దరిచేరుతాయోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. జీవీఎంసీ 45వ వార్డు యారాడ గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు ఐదేళ్ల క్రితం పలు చోట్ల పైపులైన్లు వేశారు. అయితే పీఎస్సార్‌ కాలనీ, స్థానిక జెడ్పీ పాఠశాల ప్రాంతాల్లో  వేసి న పైపులైన్లు మాత్రం అక్కడున్న మురుగు కాలువలకు ఆనుకొని వేశారు.

దీంతో ఆయా ప్రాంతాల్లో మురుగు నిలిచిపోతున్నప్పుడల్లా తాగు నీటిపై అనుమా నం వస్తోంది. ఆ మురుగు పైపులైన్‌ వాల్వ్‌ల వద్ద ఉన్న ప్లాంజ్‌ ద్వారా లోపలికి ప్రవేశించి నీటి సరఫరా జరిగే సమయంలో తాగునీటితో కలిసిపోతోంది. ఒక్కోసారి తాగునీరు మురుగు వాస న వస్తోందని గ్రామస్తులు చెబుతుండడమే ఇం దుకు ఉదాహారణ. మురుగుతో కలిసిపోయే నీటితే సేవించినందుకు గతంలో ఆయా ప్రాంత వాసులకు జ్వరాలు, వాంతులు వచ్చాయి. సమ స్య పరిష్కారం కోసం గ్రామస్తులు జీవీఎంసీ జోన్‌–4 జెడ్సీతో పాటు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు కూడా ఎన్నోమార్లు వివరించారు. అయినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు.

మురుగునీరే వస్తోంది
ఇక్కడకొచ్చే తాగునీరు మురుగునీటిలా వస్తోంది. ఆ నీరు తాగలేని పరిస్థితి ఉంది. గతేడాది వర్షాకాలంలో కాలువల్లో మురు గు అధికంగా నిల్వ ఉండిపోవడంతో వారం రోజుల పాటు ఆ నీటి నే పట్టాల్సి వచ్చింది. పిల్లలకు అనారోగ్యం వచ్చింది.

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)