amp pages | Sakshi

ఖాతాల నిలిపివేత హైకోర్టు

Published on Sat, 01/31/2015 - 02:17

  • ఎస్‌బీహెచ్‌పై పరువునష్టం దావా  సమీక్ష అనంతరం గంటా వెల్లడి
  • సాక్షి, హైదరాబాద్: తమ ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్తంభింపచేయడంపై హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మండలి విధులకు ఆటంక పరిచినందుకు, విద్యార్థుల పరీక్షలు భవితతో ముడిపడి ఉన్న వ్యవహారాలు ఆలస్యమయ్యేలా వ్యవహరించినందుకు క్రిమినల్ డిఫమెషన్ దావా కూడా దాఖలు వేయాలని భావిస్తోంది.

    ముందుగా ఖాతాల నిలిపివేతపై సోమవారం హైకోర్టును ఆశ్రయించనుంది. తాజా పరిస్థితిపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నత విద్యా మండలి అధికారులతో శుక్రవారం సమీక్షించారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి,విద్యా మండలి ఛైర్మన్‌ఎల్.వేణుగోపాలరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.నోటీసులు ఇవ్వకుండా ఎస్‌బిహెచ్ మండలి ఖాతాలను స్తంభింపచేయడం చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.  
     
    కేబినెట్లో నిర్ణయించాక ఎంసెట్‌పై నిర్ణయం..: ఉమ్మడి ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో తదుపరి కార్యాచరణపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. వివిధ సెట్లకు యూనివర్సిటీల ఎంపిక, కన్వీనర్ల నియామకం, పరీక్షల ఏర్పాట్లు వంటి అంశాలను పూర్తిచేయాల్సి ఉందని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కనుక దీనిపై వచ్చేనెల 2న కేబినెట్లో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. సమావేశం అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ సమీక్ష వివరాలను వెల్లడించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)