amp pages | Sakshi

కలవరపెడుతున్న నకిలీ ఎరువు

Published on Thu, 11/28/2013 - 03:01

బిచ్కుంద న్యూస్‌లైన్:  రబీ సాగుకు సిద్ధమవుతున్న త రుణంలో రైతన్నను కల్తీ ఎరువులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారుల్లో నిం డా నిర్లక్ష్యం పేరుకుపోయింది. కల్తీ ఎరువులను గుర్తించేందుకు లక్ష్యం మేరకు దుకాణాల నుం చి కనీసం శాంపిళ్లను సేకరించలేకపోతున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రతి మండల వ ్యవసాయ అధికారి తన పరిధిలో ఉన్న దుకాణాల నుంచి ఎరువుల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. ఎరువుల్లో నాణ్యత లోపిస్తే అధికారులు వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.

అయితే ఎక్కడా ఈ మేరకు అధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది జిల్లాకు సుమారు 560 శాంపిళ్ల సేకరణను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని 36 మండలాల నుంచి  లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. కాగా అధికారుల ఇప్పటి వరకు కేవలం 280 శాంపిళ్లను సేకరించి చేతులు దులుపుకున్నారు. ఎక్కువగా ఎరువుల వినియోగం ఖరీఫ్‌లోనే ఉన్నా..ఎప్పటికప్పుడు అనుమానం కలి గి నా... రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు ఆయా దుకాణాల నుంచి శాంపిళ్లను సేకరించి జాగ్రత్త పర్చాలి. అయితే ఇవేమీ అమలు కావడం లేదు. కల్తీ ఎరువులపై కొరడా ఝళిపించాల్సిన విజిలెన్స్ అధికారులు పత్తాలేకుండా పోయారు. అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహించామనిపించి అధికారులు తర్వాత కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
 సరిహద్దులో
 మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న జిల్లాలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుం ద, బోధన్ మండలాల్లో జోరుగా నకిలీ ఎరువులు, స్ప్రే మందుల విక్రయాలు సాగుతున్నాయి. నాణ్యతను గుర్తించలేకపోతున్న రైతులు వాటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో నిజామాబాద్ ఏడీఏ ప్లాంట్ ప్రొటక్షన్ అధికారి చంద్రశేఖర్‌ను సంప్రదించగా జిల్లాలో ఇప్పటి వరకు 280 ఎరువుల శాంపిళ్లు సేకరించామని తెలిపారు. అందులో నిజామాబాద్ నగరంలోని దుకాణాల్లో లభించిన 10.26.26, 17.17.17,  14.35.14 ఎరువులలో నాణ్యత తక్కువగా ఉందని తెలి పారు. బిచ్కుంద ఏడీఏ వేణుగోపాల్ మాట్లాడుతూ జుక్కల్‌లో 20.20.0.13 రకాల ఎరువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలిందని చెప్పారు. ఎవరైనా ఇలాంటి ఎరువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌