amp pages | Sakshi

ముగిసిన నామినేషన్ల పర్వం

Published on Tue, 03/26/2019 - 13:37

సాక్షి, విజయనగరం గంటస్తంభం: నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. మొత్తం ఆరు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. విజయనగరం ఎంపీ స్థానానికి 17 మంది, తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలకు 130 మంది నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్లు పరిశీలన మంగళవారం జరగనుంది. ఇదేరోజు నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్‌ 11వ తేదీన జరిగే తొలివిడత పోలింగ్‌కు మార్చి 18న  నోటిఫికేషన్‌ జారీ చేయగా అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ జరిగింది. 18 నుంచి 22వ తేదీ వరకు వరుసుగా నామినేషన్లను అధికారులు స్వీకరించారు.  23, 24 తేదీలు సెలవులు కావడంతో ఆఖరి రోజు 25న నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారులు స్వీకరించారు. 


చివరిరోజు రోజు 83 నామినేషన్లు 
జిల్లాలో చివరి రోజు ఏకంగా 83 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతకుముందు ఐదురోజులు పాటు 64 నామినేషన్లురాగా ఆఖరి రోజు అంతకుమించి రావడం విశేషం. ఇందులో విజయనగరం ఎంపీ స్థానానికి 10 నామినేషన్లు వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు వేశారు. కురుపాం నియోజకవర్గానికి 5, పార్వతీపురానికి 6, సాలూరులో 12, బొబ్బిలిలో 7, చీపురుపల్లిలో 7, గజపతినగరంలో 7, నెల్లిమర్లలో 13, విజయనగరంలో 3, శృంగవరపుకోటలో 13 చివరి రోజైన సోమవారం దాఖలయ్యాయి. బొబ్బిలి నుంచి టీడీపీ అభ్యర్థి సుజయ్‌కృష్ణ రంగారావు మాత్రమే నామినేషను వేశారు. 

రెండు నియోజకవర్గాల్లో అత్యధికంగా 19మంది
మొత్తంగా చూస్తే విజయనగరం ఎంపీ స్థానానికి 17మంది నామినేషను దాఖలు చేశారు. ఎమ్మెల్యే స్థానాల్లో ఎస్‌.కోట, నెల్లిమర్లలో 20మంది చొప్పున నామినేషన్లు వేశారు. అత్యల్పంగా పార్వతీపురంలో 10 మంది నామినేషన్లు సమర్పించారు. 

నియోజకవర్గాల వారీగా నామినేషన్ల సంఖ్య

నియోజకవర్గం     నామినేషన్లు
విజయనగరం ఎంపీ    17
కురుపాం    13
పార్వతీపురం     10
సాలూరు     15
బొబ్బిలి     11
చీపురుపల్లి      15
గజపతినగరం     13
నెల్లిమర్ల      20
విజయనగరం     13
శృంగవరపుకోట      20 










 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)