amp pages | Sakshi

సెక్షన్‌ 30.. సెక్షన్‌ 144 పెట్టినప్పుడు ఏమయ్యారు? 

Published on Thu, 02/20/2020 - 09:17

సాక్షి, అమలాపురం: ‘గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏడాది పొడువునా సెక్షన్‌ 30 పెట్టారు. రైతుల సమావేశం అంటే 144 సెక్షన్‌ ఉందని హెచ్చరించేవారు. సమావేశం పెట్టుకుంటే పోలీసులు వచ్చి మైకులు విరగ్గొట్టారు. సాగు సమ్మె చేయమని పిలుపునిస్తే చూస్తూ ఊరుకోబోమని సాక్షాత్తూ నాటి హోంశాఖ మంత్రి హెచ్చరించారు. అప్పుడెందుకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. మాకెందుకు మద్దతుగా నిలవలేదు. ఇప్పుడెందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు?’ అంటూ కొంతమంది రైతు సంఘం నాయకులు నిలదీయడంతో టీడీపీ అనుకూల రైతు సంఘం నాయకులకు నోరు పెగల్లేదు. అమరావతి రైతులకు అనుకూలంగా తీర్మానం చేయించాలనే ఉద్దేశంతో టీడీపీ అనుకూల రైతులు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సమావేశం నిర్వహించగా వారికి ఝలక్‌ తగిలింది. స్థానిక విద్యుత్‌ నగర్‌లో బుధవారం కోనసీమ రైతు పరిరక్షణ సమితి, భారతీయ కిసాన్‌ సంఘల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తీర్మానంతోపాటు ధాన్యం సొమ్ములు రావడం లేదని, నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామనే తీర్మానాలు చేయాలని టీడీపీ అనుకూల రైతులు తలపోశారు. ఈ విషయాలు తెలుసుకున్న  రైతు సంఘం నాయకులు కొంతమంది స్పందించారు.

స్థానిక సమస్యలపై చర్చిద్దాం..
‘ఎక్కడో రైతుల సమస్యలు తరువాత.. ముందు ఇక్కడ విషయాలు మాట్లాడదాం?’ అని బీకేఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల జమ్మి అన్నారు. కొంతమంది రైతులు ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు రాలేదని ప్రస్తావించగా ‘ధాన్యం బాగానే పండింది. ప్రభుత్వం మంచిగానే కొనుగోలు చేసింది. సొమ్ములు రేపో, ఎల్లుండో వస్తాయి. 2011 సాగు సమ్మె తరువాత నుంచి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాల నుంచి మనకు పంట నష్టం పరిహారం ఇవ్వలేదు. రైతు రుణమాఫీ సొమ్ములు పూర్తిగా అందలేదు. పనిలో పని వాటి మీద కూడా చర్చిస్తే మంచిది’ అని జమ్మి తేల్చిచెప్పారు.

విజయవాడలో రైతులకు కాని, రైతు కూలీలకు కాని నష్టం జరిగితే మాట్లాడదాం, అంతేకాని రాజధాని మార్పు విషయం గురించి ఇక్కడ మాట్లాడతామంటే కుదరదు’ అని తెగేసి చెప్పాడు. ఆయనకు రాష్ట్ర అగ్రికల్చర్‌ మిషన్‌ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి), డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ గోదాశి నాగేశ్వరరావు తదితరులు దన్నుగా నిలిచారు. గోదాశి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కేసుల నమోదు, అప్పటి ఆర్డీవో కార్యాలయంలో రైతులతో జరిగిన చర్చలో రైతు సంఘం నాయకుడు రంబాల బోస్‌కు జరిగిన అవమానం గుర్తు చేయడంతో కొంతమంది టీడీపీ అనూకూల రైతులు అభ్యంతరం చెప్పారు. జరిగిన విషయం చెప్పుకుంటే మీకు ఉలికెందుకని కొంతమంది ప్రశ్నించడంతో టీడీపీ అనుకూల రైతులు మిన్నకుండా ఉండిపోయారు. 

సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్ర వివిధ కారణాలతో ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేయాలంటూ ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు సొమ్ములు విడుదల చేయాలని, రబీకి నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం అధ్యక్షత వహించారు. రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు రంబాల బోస్, బీకేఎస్‌ నాయకుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతు సంఘం నాయకులు రాయుపురెడ్డి జానకీరామయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు.

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)