amp pages | Sakshi

విద్యార్థులకు షాక్

Published on Tue, 11/19/2013 - 02:17

 సాక్షి, గుంటూరు: ఎట్టకేలకు కళాశాల, హాస్టల్ ఫీజులు మంజూరయ్యాయని మురిసిపోతున్న విద్యార్థులకు పెద్దషాక్ తగిలింది. సంక్షేమ శాఖ అధికారులు పంపిన బ్యాంక్ అకౌంట్ నంబర్లు సక్రమంగా లేవని నిధులు విడుదలకు నోచుకోక ఖజానాలో మూలుగుతున్నాయి. మరోవైపు కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్లో ఇదొకటి. 2012-13 విద్యా సంవత్సరానికి ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కోరుతూ వివిధ సంక్షేమ శాఖల ద్వారా 62వేల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది.
 
 ఈ విధానంలో కిందటి ఏడాది జిల్లా ఖజానా శాఖ నుంచి రూ.120 కోట్లకు పైగా నిధులు విడుదలయ్యాయి. మరో రూ.12 కోట్లు విడుదల కావాల్సి ఉందని సంక్షేమ శాఖల అధికారు లు రెండు నెలల క్రితమే వెల్లడించారు. ఈ ఏడాది రెన్యూవల్ చేసుకోవాల్సిన విద్యార్థులకు కళాశాలల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. కిందటి ఏడాది అందాల్సిన ట్యూషన్ ఫీజులకే దిక్కులేదని, ప్రస్తుత ఏడాది కూడా ప్రభుత్వంపై నమ్మకం ఉంచి చదువులు చెప్పలేమని యాజమాన్యాలు చేతు లెత్తేస్తున్నాయి. ఈ విషయంపై ‘సాక్షి’ ఆరా తీయగా ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన బకాయిలు వచ్చాయని, అయితే అకౌంట్ నంబర్లలో తేడా వచ్చి జిల్లా ఖజానాలో వున్నాయని తెలిసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలులో నోడల్ ఏజెన్సీ లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతు న్నాయనే భావన అంతటా వ్యక్తమవుతోంది.  
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)