రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘చందన బ్రదర్స్’లో అగ్ని ప్రమాదం
Published on Thu, 11/02/2017 - 02:19
సాక్షి, గుంటూరు ఈస్ట్ : గుంటూరు నగరంలోని ఆర్కేటీ సెంటర్లో ఉన్న వస్త్ర దుకాణం చందన బ్రదర్స్ షోరూంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని జెంట్స్ వేర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చాయి. షోరూం సిబ్బంది రాత్రి షట్టర్‌కు తాళాలు వేసి బయలు దేరుతున్న సమయంలో పై అంతస్తుల నుంచి దట్టమైన పొగలు వచ్చాయి.
ఈ క్రమంలో పైకి వెళ్లి చూడగా నాలుగో అంతస్తు నుంచి మంటలు రావడం గమనించి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్ల ద్వారా మంటలు అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి 11.30 గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags