amp pages | Sakshi

ప్రతి నిరుద్యోగినీ...ఉద్యోగిగా

Published on Tue, 09/25/2018 - 02:20

సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్‌ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, పేద విద్యార్థులకు భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్‌సి నిర్వహించు గ్రూప్‌ -1, 2, 3, 4, వీఆర్‌ఓ, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 28న నంద్యాలలోని  శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్‌ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.

             రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు శోభా హోటల్‌ పక్కన గల శ్రీ వెంకటేశ్వర  (యస్‌.వి) డిగ్రీ కాలేజిలో తరగతులు ప్రారంభమవుతాయి. తెల్లరేషన్‌ కార్డు కలిగిన అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించినా వారికి మరొక అవకాశం కల్పిస్తామని, అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి తరగతులకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు లక్ష్మణ్‌ గారు తెలిపారు.

                 అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణా కాలంలో మెటీరియల్‌ అందిస్తారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వారికి మరొక అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.krishnamma.org వెబ్‌సైట్‌లో లేదా సంస్థ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్‌ టెస్ట్‌లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రోత్సాహకాలు అందిస్తారని తెలిపారు.


                 రెండవ బ్యాచ్‌ కోసం గ్రూప్స్‌ ఉద్యోగాలకు సెప్టెంబర్‌ 28వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు సెప్టెంబర్‌ 30వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్‌, నేషనల్‌ జూనియర్‌ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్‌, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 62814 63267 నెంబర్‌ను సంప్రదించగలరు.

           

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌