amp pages | Sakshi

ఒంటిమిట్ట వేడుకల్లో అపశ్రుతి.. నలుగురి మృతి

Published on Fri, 03/30/2018 - 20:02

సాక్షి, కడప : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి దొర్లింది. ఈ వేడుకలను చూడటానికి వచ్చిన మృత్త్యువాత పడ్డ భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ నలుగురు మృత్యువాత పడ్డారు. ఈదురు గాలులు, వడగండ్ల వర్షం కురుస్తుండటంతో నవమి వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోదండరాముడి వేడకల్లో పాల్గొనేందుకు కడప చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ వర్షం కారణంగా ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో బస చేస్తున్నారు. ఆలయం వద్ద ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడుతుండటంతో ఆలయ సమీపంలో ఉన్న చెట్టు నేలకొరిగింది.

ఈదురు గాలుల ధాటికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో బద్వేలుకు చెందిన చిన్న చెన్నయ్య మృత్యువాత పడ్డాడు. పోరుమామిళ్లకు చెందిన వెంగయ్య తొక్కిసలాటలో మరణించగా, దక్షిణ గోపురం వద్ద బారికేడ్స కొయ్యలు పడి వెంకట సుబ్బమ్మ అనే మహిళ మృతి మరణించింది. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మీనా అనే మహిళ సైతం ప్రాణాలు కోల్పోయింది. ఆలయానికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్ గాలికి ఎగిరిపడి బోయినపల్లికి చెందిన భాస్కర్‌, నందలూరుకు చెందిన ధనుంజయ్‌ నాయుడులకు స్వల్పగాయాలయ్యాయి. అయితే వర్షం ఎక్కువగా కురుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో పక్కనే ఉన్న హరిత హోటల్‌కు వద్దకు చేరుకుంటున్నారు. బలమైన గాలుల వీస్తుండంతో అక్కడ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు, టెంట్లు చెల్లా చెదరుయ్యాయి. కల్యాణం వీక్షించడానికి వచ్చిన వేలాది భక్తులు వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడగండ్లు, ఈదురు గాలులు కారణంగా విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఒంటిమిట్ట, ఆలయంలో అంధకారం అలముకుంది.


రేకులు మీద పడటంతో గాయపడిన భక్తుడు



పోలీసుల ఓవర్‌ యాక్షన్‌ :
ముఖ్యమంత్రి వైఎస్సార్ జిల్లా పర్యటన సందర్భంగా కడప పోలీసులు స్వామి భక్తి చాటుకొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే అత్యుత్సాహం ప్రదర్శించారు. గురువారం నుంచే కడపలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రయల్‌ రన్‌ అంటూ గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పరచారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి బస చేసే ప్రాంతంలో దుకాణాలు అన్నింటినీ బలవంతంగా మూసేయించారు. ఈ విషయాన్ని స్థానిక నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో కర్నూలు రేంజ్‌ డీఐజీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

సంతాపం తెలిపిన వైఎస్ జగన్

ఒంటిమిట్ట ‍ శ్రీరామ నవమి వేడుకలో జరిగిన ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ సంతాపం ‍తెలిపారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)