amp pages | Sakshi

ఇక్కడ ఖాళీ.. అక్కడ రద్దీ

Published on Mon, 07/20/2015 - 03:47

సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు దేశం నలుమూల నుంచీ రాజమండ్రి తరలివస్తున్న యాత్రికులు రాత్రి బస చేయడంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగర శివార్లలో ఏర్పాటు చేసిన పుష్కర నగర్‌ల నుంచి ఘాట్లకు దూరం ఎక్కువగా ఉంటోంది. అంత దూరం నడిచి వెళ్లడానికి వారు ఇక్కట్లు పడుతున్నారు. దీంతో దూరప్రాంతంలోని పుష్కర నగర్‌లు ఖాళీగా ఉంటున్నాయి. కానీ స్నానఘట్టాలకు దగ్గరగా ఉన్న రైల్వే వెయిటింగ్, ప్రైవేటు వసతి ప్రదేశాలు మాత్రం కిక్కిరిసిపోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లోనూ అవి ముగిసిన తర్వాత అక్కడే కుర్చీల్లో భక్తులు సేద తీరుతున్నారు.

అయితే ఇక్కడ వారికి ఎలాంటి సదుపాయాలూ లభించడం లేదు. కనీసం తాగునీరు కూడా దొరకడం లేదు. ఆర్ట్స్ కళాశాల, లూథర్ గిరి, రైల్వే గూడ్స్ షెడ్, సాంస్కృతిక కళాశాల మైదానాల్లో ప్రధాన పుష్కర నగర్‌లు ఉన్నాయి. ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పుకొచ్చారు. అక్కడినుంచి పుష్కర ఘాట్‌లకు వెళ్లేందుకు ఆర్టీసీ ఉచిత బస్సులను అందుబాటులో ఉంచారు. కానీ పుష్కర నగర్‌లకు జనం వెళ్లకపోవడంతో ఉచిత బస్సులు యాత్రికులకు సగమే ఉపయోగపడుతున్నాయి. దీనికి పూర్తి భిన్న పరిస్థితులు రైల్వే స్టేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాల్లో కనిపిస్తోంది.

గోదావరి రైల్వే స్టేషన్ పుష్కర్ ఘాట్‌కు అతి సమీపంలో ఉండటంతో రైలు దిగిన యాత్రికులు ఇక్కడే ఉంటున్నారు. వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేసినప్పటికీ వాటిలో ఫ్యాన్లు, పడుకోవడానికి కార్పెట్లవంటివి లేవు. దీంతో భక్తులు మట్టిలోనే పడుకుంటున్నారు. కొందరు రైల్వే బ్రిడ్జి కింద పిండప్రదానాల కోసం వేసిన టెంట్లలోనే సేద తీరుతున్నారు. పక్కనే వందలాది టాయిలెట్లు ఉండటంతో దుర్గంధంతో పాటు దోమల బెడదతో నరకం చవి చూస్తున్నారు.

సుబ్రహ్మణ్య మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత యాత్రికులు అక్కడే కుర్చీల్లో పడుకుంటున్నారు. వారిని పట్టించుకున్న నాథుడే లేడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన పుష్కర నగర్‌లను కనీస ప్రణాళిక లేకుండా దూరప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో ఆ నిధులు నిరుపయోగమైనట్టు అయింది. కనీసం ఘాట్‌ల దగ్గర్లో సేద తీరే భక్తుల బాగోగులు పట్టించుకుంటే కొంతలో కొంత ఊరట లభిస్తుంది.

Videos

లండన్ కు చేరుకున్న సీఎం జగన్

వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?

తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం

థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

RCB vs CSK: ప్లే ఆఫ్స్‌ బెర్తుకై చావో రేవో

లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు

చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)