amp pages | Sakshi

కృష్ణా డెల్టాలో భారీగా చమురు !

Published on Sat, 02/08/2014 - 02:23

రూ. 3 లక్షల కోట్ల విలువైన ఆయిల్ నిక్షేపాలు
ఓఎన్‌జీసీ-కెయిర్న్ ఎనర్జీ పరిశోధనలు సక్సెస్
భూగర్భంలో 4 కి.మీ. లోతులో 1,697 చ.కి.మీటర్లలో విస్తరణ
కేజీ బేసిన్‌లోనే అత్యంత భారీ భూగర్భ క్షేత్రం
దివిసీమ నుంచి గుంటూరు జిల్లా రేపల్లె వరకు చమురే

 
 బొల్లోజు రవి, సాక్షి ప్రతినిధి విజయవాడ:
కృష్ణా డెల్టా ప్రాంతంలో భారీగా చమురు నిల్వలు బయటపడ్డాయి. ఓఎన్‌జీసీ-కెయిర్న్ ఎనర్జీ సంస్థలు సంయుక్తంగా 8 ఏళ్ల పాటు చేసిన పరిశోధన విజయవంతమైంది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లోనే ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన చమురు నిక్షేపంగా మారనుంది. 550 మిలియన్ బ్యారర్ల చమురు ఈ క్షేత్రంలో నిక్షిప్తమై ఉండొచ్చని అంచనా వేశారు. దీని విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం ఏకంగా రూ.3 లక్షల కోట్లపైనే ఉంటుందని ఈ అన్వేషణలో పాలుపంచుకున్న కంపెనీ వర్గాల ద్వారా తెలిసింది. రాబోయే రెండు, మూడేళ్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.
 
 2006 నుంచే పరిశోధనలు: మొదట్లో కృష్ణా డెల్టాలో చమురు, గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తిపై పెద్దగా అంచనా ఉండేది కాదు. కేజీ బేసిన్‌లో భాగమైన ఈ ప్రాంతాన్ని గతంలో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. రిలయన్స్ సంస్థ కూడా పెద్దగా ఖాతరు చేయలేదు. ఓఎన్‌జీసీ మాత్రమే కృష్ణా జిల్లాలోని మల్లేశ్వరం ప్రాంతంలో 16 ఆయిల్, 16 చమురు బావుల నుంచి నిక్షేపాలను వెలికి తీస్తోంది. దివిసీమలోని నాగాయలంక, గుంటూరు జిల్లా రేపల్లె వరకు భూగర్భంలో నిక్షేపాలపై కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎక్స్‌ఫ్లోరేషన్ లెసైన్సింగ్ పాలసీ (ఎన్‌ఈఎల్‌పీ-నెల్ప్) బిడ్డింగ్ నిర్వహించింది.
 
 ఆ బిడ్డింగ్‌ను ఓఎన్‌జీసీ, కెయిర్న్ ఎనర్జీ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. అందులో ఓఎన్‌జీసీ వాటా 51 శాతం కాగా... కెయిర్న్ ఎనర్జీ వాటా 49 శాతంగా ఉంది. 2006-07లో ఆ క్షేత్రంలో ఇవి కాలుమోపాయి. అప్పట్నుంచి పరిశోధనలు చేశాయి. నాగాయలంకలో ప్రయోగాత్మకంగా మూడు బావులను తవ్వారు. 2011లో ఒక బావిని, 2012లో మరో బావిని, 2013లో మూడో బావిని తవ్వారు. ఆ మూడు బావులు విజయవంతమయ్యాయి. ఈ క్షేత్రంలో గ్యాస్ కంటే కూడా చమురు నిక్షేపాలే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఏకంగా 550 మిలియన్ బ్యారళ్ల ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చమురు బ్యారల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.106 డాలర్లు ఉంది. ఆ ప్రకారం చూస్తే మొత్తం ఇక్కడి నిక్షేపాల విలువ ఏకంగా రూ.3 లక్షల కోట్లు పైనే ఉంటుందని అంచనా.
 
 ప్రయోగాలు చేశారు ఇలా: ఈ ప్రయోగాలకు ముందు కృష్ణా డెల్టాలోని నాగాయలంక-రేపల్లె  క్షేత్రంలో 2011 వరకు 3 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే ప్రయోగాలు చేసేవారు. ఆ లోపు ఎప్పుడూ నిక్షేపాలు బయటపడలేదు. అంతర్జాతీయ డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా ఓఎన్‌జీసీ-కెయిర్న్‌లు 4 కిలోమీటర్ల వరకు పరిశోధన సాగించాయి. అక్కడ భారీ ఒత్తిడితోపాటు 178 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటిచోట సాధారణమైన పరికరాలు పనిచేయవు. ఈ నేపథ్యంలో శంబర్గర్ అనే అంతర్జాతీయ కంపెనీకి చెందిన డిజిటల్ టెక్నాలజీతో ప్రయోగాలు చేపట్టారు. 4 కి.మీ. లోతులో.. 1,697 చదరపు కి.మీ. విస్తరణలో ఉన్న ఈ నిక్షేప ప్రాంతాన్ని మరింత పరిశోధిస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)