amp pages | Sakshi

మిస్డ్‌ కాల్‌ ఇస్తే చాలు..

Published on Mon, 04/20/2020 - 04:21

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్, ప్రజా రవాణా స్తంభించిన నేపథ్యంలో ప్రజలకు ఫోన్‌ ద్వారానే వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ విధానానికి అపూర్వ స్పందన లభిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 14410కు గడిచిన నాలుగు రోజుల్లో 8,243 మంది ఫోన్‌ చేశారు. వీరిలో 4,732 మందికి వైద్యులు ఫోన్‌లోనే తగిన సూచనలు, అవసరమైన మందుల సమాచారం ఇచ్చారు. మరో 3491 మందికి వైఎస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ ప్రతినిధులు తిరిగి కాల్‌ చేయగా వారు స్పందించలేదు. 14410 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే డాక్టర్లు ఫోన్‌ ద్వారానే  సలహాలు ఇవ్వడంతో పాటు అవసరమైన మందుల వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మెడికల్‌ ఆఫీసర్‌కు సమాచారమిస్తున్నారు. అక్కడ్నుంచి మందులు పేషెంటు ఇంటికే సరఫరా చేస్తారు.
 
ఇలా చెయ్యండి..

► ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు 14410కు మిస్డ్‌ కాల్‌ ఇస్తే సరిపోతుంది. 
► ఆ తర్వాత కాల్‌సెంటర్‌లో పనిచేసే ఎగ్జిక్యూటివ్‌ తిరిగి మనకు కాల్‌ చేస్తారు.
► మన వివరాలు నమోదు చేసుకుని సమస్యను తెలుసుకుని సంబంధిత డాక్టరుకు కనెక్ట్‌ చేస్తారు.
► డాక్టరు మన సమస్యలు విన్నాక మందులు అవసరమనుకుంటే సంబంధిత మెడికల్‌ ఆఫీసర్‌కు సూచిస్తారు.
► ఆ తర్వాత పేషెంటు ఇంటికే మందులు తీసుకొచ్చి ఇస్తారు.
► మనం మిస్డ్‌ కాల్‌ ఇవ్వగానే తిరిగి ఎగ్జిక్యూటివ్‌ చేస్తారు..కాల్‌ బిజీ వచ్చినా, స్విచ్‌ఆఫ్‌ వచ్చినా రెండోసారి చేస్తారు.
► రెండోసారి ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వక పోతే మళ్లీ కాల్‌ రాదు. మళ్లీ కొత్తగా మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలి.
► ప్రస్తుతం టెలీ మెడిసిన్‌ కోసం వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్యులు 286 మంది వాలంటరీగా వచ్చి రిజిస్టర్‌ చేసుకుని పనిచేస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)