amp pages | Sakshi

భర్తకు ఆరు నెలల గృహ నిర్బంధం!

Published on Sun, 06/24/2018 - 08:35

అల్లవరం (అమలాపురం): రోజూ తనతో గొడవ పడుతూ హింసిస్తున్న భర్తను మరో ఇద్దరి సాయంతో భార్య తీవ్రంగా కొట్టి, ఆరు నెలలుగా గృహ నిర్బంధంలో ఉంచింది. విషయం వెలుగులోకి రావడంతో అల్లవరం పోలీసులు ఈ ఘటనపై శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై డి. ప్రశాంత్‌కుమార్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొక్కిరిగడ్డ వీర వెంకట సత్యనారాయణ, సూర్యకుమారి దంపతులు మండలంలోని కొమరగిరిపట్నం శివారు మిలటరీ కాలనీలో నివశిస్తున్నారు.సత్యనారాయణ చాలాకాలం దుబాయ్‌లో పనిచేసి తిరిగి వచ్చాడు. అతడు తరచూ భార్యతో గొడవ పడేవాడు. మద్యం సేవించి వచ్చి భార్యను హింసించేవాడు.  దీంతో విసిగిపోయిన సూర్యకుమారి ఈ ఏడాది జనవరి ఐదో తేదీన సంగాని రాంబాబు, పొనమండ శ్రీనివాసరావు అనే మరో ఇద్దరితో కలిసి రాడ్డులతో భర్త సత్యనారాయణపై దాడి చేసింది. గాయపడిన అతడిని గృహంలోనే నిర్బంధించింది. 

విషయం బయట పడింది ఇలా..
ఐదు నెలలు పైబడినా తన అన్న సత్యనారాయణ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సఖినేటిపల్లిలో నివసించే అతడి సోదరుడు కొక్కిరిగడ్డ నాగమలేశ్వరరావుకు అనుమానం వచ్చింది. దీంతో అతడు అన్నను చూసేందుకు  కొమరగిరిపట్నం శివార్లలోని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి గాయాలతో బాధపడుతూ జీవచ్ఛంలా పడి ఉన్న సత్యనారాయణ కనిపించాడు. 

దీంతో  నాగమల్లేశ్వరరావు పోలీసుల సహకారంతో అన్నను గృహ నిర్బంధం నుంచి విడిపించి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు.  శనివారం ఉదయం నాగమల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి సూర్యకుమారిని అరెస్టు చేశామని ఎస్సై ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న సత్యనారాయణకు స్థానికంగా ఉన్న పీఎంపీతో చికిత్స చేయించారే తప్ప పెద్దాస్పుత్రిలో చికిత్స అందించలేదు. ప్రస్తుతం అతడి చేతులు విరిగి వేలాడుతున్నాయని, మోకాలి చిప్ప పగిలిపోవడంతో నడవలేకపోతున్నారని ఎస్సై తెలిపారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)