amp pages | Sakshi

పూల సాగుతో ఆదాయం

Published on Thu, 05/29/2014 - 04:13

 పాలసముద్రం, న్యూస్‌లైన్:  మండలంలో పూల సాగుతో రైతులు మంచి ఆదాయూన్ని పొందుతున్నారు. తమిళనాడు సరిహద్దులో ఉన్న తిరుమలరాజుపురం, బాలకృష్ణాపురం, గంగమాంబాపురం ప్రాంతాల్లో  బంతి, మల్లె, వెల్‌వెట్ బంతి పూల సాగు చేస్తున్నారు. మంచి దిగుబడితో పాటు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతులు పూల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మార్కెట్ సదుపాయం కూడా బాగా ఉండడడంతో రైతులు లాభాలను ఆర్జిస్తున్నారు.

మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా పూల తోటలు సాగులో ఉన్నారు. ప్రస్తుతం అన్ని రకాల పూలు కిలో రు.60 నుంచి రు70 వరకు ధర పలుకుతున్నాయి. ఈ పూలు ఐదు రోజులైనా వాడకుండా ఉంటారుు. దీంతో వ్యాపారులకు ఎలాంటి నష్టం రాదు. జాతరలు, పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో ఈ పూలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఎకరా పూల సాగు చేస్తే రూ. 60 వేల నుంచి 70 వేలు వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. నీరు కూడా రెండు రోజులకు ఒక సారి పారిస్తేచాలని.

పంటకాలం ఆరునెలలు. ఒకసారి పంట సాగు చేస్తే రెండేళ్ల పాటు దిగుబడి వస్తుంది. ఎలాంటి తెగుళ్ల బెడదా ఉండదు. పూలు కోసే వారికి కూలి మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.  ఏడాది పొడువునా బంతి, వెల్‌వెట్ పూలకు మార్కెట్‌లో రేట్లు  నిలకడగా ఉంటుండడంతో మరింత మంది రైతులు ఈ పూల సాగుకు ఉత్సాహం చూపుతున్నారు.  ఇక్కడి నుంచి పూలను చెన్నై, వేలూరు, బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?