amp pages | Sakshi

పీజీ వైద్య సీట్ల భర్తీకి మార్గదర్శకాలు

Published on Thu, 05/22/2014 - 02:02

 సాక్షి, హైదరాబాద్: 2014-15 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య సీట్లు, పీజీ డెంటల్ సీట్ల భర్తీకి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత ఏడాది సీట్ల భర్తీ కోసం ఇచ్చిన జీవో నెం.43కు కొన్ని సవరణలు చేస్తూ వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషాలిటీ సీట్ల వారీగా ఈ సారి భర్తీ జరుగుతుంది. ఉదాహరణకు రాష్ట్రవ్యాప్తంగా 150 జనరల్ మెడిసిన్ సీట్లు ఉన్నాయనుకుంటే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల కేటగిరీలతో పాటు వికలాంగ అభ్యర్థులకు సైతం ముందే సీట్లు రిజర్వ్ చేస్తారు. గతంలో అయితే ప్రతి వంద పాయింట్లను లెక్కేస్తూ అభ్యర్థులకు సీట్లు కేటాయించేవారు. అంతేకాదు గతంలో ఉన్న విధానం ప్రకారం మంచి ర్యాంకులు సాధించిన వారు బాగా ప్రాచుర్యం ఉన్న సీట్లను ఎంచుకునేవారు. దీంతో మెరిట్ విద్యార్థులు సీట్లను పొందేవారు. ఇప్పటి విధానం ప్రకారం ప్రతి స్పెషాలిటీలోనూ ప్రతి కేటగిరీకి చెందిన అభ్యర్థి ఉంటారు. కాగా గతంలో ఇచ్చిన జీవోకు చిన్న సవరణ చేశారు. గతేడాది ఆర్థోపెడిక్ సీట్లు మహిళలకు కేటాయించినప్పుడు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో సీట్లు మిగిలిపోయేవి. ఈ సారి అలా సీట్లు మిగిలిపోతే మిగతా వారికి కేటాయించాలని నిర్ణయించారు. కేటగిరీల వారీగా ముందే సీట్లు కేటాయిస్తే రిజర్వ్‌డ్ అభ్యర్థులకు ఎలాంటి నష్టమూ ఉండదని భావించారు. ఈ ఏడాది సీట్ల భర్తీలో యూనివర్శిటీల వారీగా, కాలేజీల వారీగా పక్కాగా సీట్ల విధానాన్ని అనుసరించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
 
 కొత్త విధానం ప్రకారం
 
  మహిళా అభ్యర్థుల సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను కేటగిరీల వారీగా జనరల్ అభ్యర్థులకు కేటాయిస్తారు
  ఎస్సీ అభ్యర్థుల సీట్లు భర్తీ కాని పక్షంలో ఆ సీట్లను ఎస్టీలకు కేటాయిస్తారు
  ఎస్టీ అభ్యర్థుల సీట్లు భర్తీ కాకపోతే ఆ సీట్లను ఎస్సీలకు కేటాయిస్తారు
  భర్తీకాని ఎస్సీ అభ్యర్థుల సీట్లు ఓసీలకు కేటాయిస్తారు
  బీసీ-ఏ సీట్లు భర్తీకాకపోతే బీసీ-బీకి కేటాయిస్తారు
  భర్తీ కాని బీసీ-బీ సీట్లను బీసీ-సీకి ఇస్తారు
  భర్తీ కాని బీసీ-సీ సీట్లను బీసీ-డీకి కేటాయిస్తారు
  భర్తీకాని బీసీ-డీ సీట్లను బీసీ-ఇకి కేటాయిస్తారు
  భర్తీకాని బీసీ-ఇ సీట్లను బీసీ-ఏకు కేటాయిస్తారు
  భర్తీకాని బీసీ సీట్లను ఓసీలకు కేటాయిస్తారు
  రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థి ఎవరైనా సీటు పొంది ఆ తర్వాత ఆ సీటును వదులుకుంటే ఆ సీటును ఓసీకి ఇస్తారు
  ఓసీ రిజర్వ్‌డ్ (ఉమెన్) సీట్లు ఖాళీగా ఉంటే ఆ సీట్లను ఓసీ క్యాండిడేట్‌లకు ఇస్తారు

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)