amp pages | Sakshi

జీవితాలతో చెలగాటం

Published on Fri, 05/11/2018 - 08:50

అనంతపురం ఎడ్యుకేషన్‌: గతంలో చేసిన తప్పిదాలను మళ్లీ చేశారు. చేసిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా.. పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. 2017–18 విద్యాసంవత్సరంలో రెగ్యులర్‌ పదో తరగతి పరీక్షలకు హాజరై ఇంటర్నల్‌(అంతర్గత) మూల్యాంకనంలో మార్కులు నమోదు కాని విద్యార్థులకు సంబంధించి ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు నమోదు చేసేందుకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో ఈ మార్కులు నమోదు కాని విద్యార్థుల వివరాలు వారి తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ కమిషనర్, అమరావతి నుంచే సమాచారం చేరవేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సీనియర్‌ ప్రధానోపాధ్యాయులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి స్థానిక కేఆస్‌ఆర్‌ బాలికల పాఠశాలలో ఈ నెల 7 నుంచి గురువారం.. అంటే నాలుగు రోజల పాటు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి రికార్డులను పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత మార్కులు నమోదు చేస్తూ వచ్చారు.

నమోదు కాని 32 మందివిద్యార్థుల మార్కులు  
జిల్లాలో 137 స్కూళ్ల నుంచి 2121 మంది విద్యార్థుల మార్కులను అప్‌లోడ్‌ చేయాల్సి ఉందంటూ రాష్ట్ర అధికారుల నుంచి జాబితా వచ్చింది. గడువు ముగిసే సమయానికి 130 స్కూళ్ల నుంచి 2,089 మంది విద్యార్థుల వివరాలు నమోదు చేశారు. ఇంకా ఏడు స్కూళ్ల నుంచి 32 మంది విద్యార్థుల మార్కులను నమోదు చేయాల్సి ఉంది. ఈ స్కూళ్లన్నీ కూడా ప్రైవేట్‌వే కావడం గమనార్హం. అనంతపురంలో రెండు, గుత్తి, గుంతకల్లు, హిందూపురం, కదిరి, మడకశిరలో ఒక్కో స్కూలు ఉంది. ఇంటర్నల్‌ మార్కులు నమోదు చేయని అన్ని స్కూళ్లకు మోమోలు జారీ చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అవకాశం ఇచ్చినా మార్కులు నమోదు చేయని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)