amp pages | Sakshi

టీడీపీ డేరా బాబాలను తరిమికొట్టండి

Published on Sun, 09/10/2017 - 03:43

వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ ధ్వజం
ఏం సాధించారని ఇంటింటికీ బయల్దేరుతున్నారు బాబూ?
కర్ణాటకలో ఏపీ యువతపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చిన ఘనత దివంగత వైఎస్‌దే
విజయవాడ: మూడున్నరేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక ప్రతి ఒక్కరినీ మోసం చేసిన టీడీపీ డేరా బాబాలు, వారి గురువులు ఇంటింటి ప్రచారానికి సిద్ధమవుతున్నారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. శనివారమిక్కడ వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల మాట్లాడారు. ఏం సాధించారని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారని నిలదీశారు. ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి మోసం చేసిన టీడీపీ డేరా బాబాలను ఏం చేయాలో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రతిపక్షంగా వైఎస్సార్‌ సీపీ గడపగడపకూ కార్యక్రమం చేపడితే ప్రజలంతా ఆదరించారని గుర్తు చేశారు. ఓట్ల కోసం వాగ్దానాలు ఇచ్చి మాటతప్పిన టీడీపీ డేరాబాబాలను జనం తరిమికొడతారని హెచ్చరించారు. 
 
యువత క్రికెట్‌ బ్యాట్‌లతో బుద్ధి చెబుతారు..
రైతు రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి మోసం చేసిన టీడీపీ బాబాలను రైతులు తరిమికొట్టాలన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ మరీ చెప్పిన చంద్రబాబు ఇప్పటిదాకా డ్వాక్రా అక్కచెల్లెళ్ల రుణాలను మాఫీ చేయలేదని ధ్వజమెత్తారు.. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిన టీడీపీ నేతలు ఇంటింటికి వెళితే యువత క్రికెట్‌ బ్యాట్‌లతో బుద్ధి చెబుతారన్నారు. నిరుద్యోగభృతి పేరుతో మోసం చేసి ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.80 వేల చొప్పున బకాయి ఉందన్నారు.  
 
175 నియోజక వర్గాలు మీవే అయితే ప్రచారమెందుకో...?
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ నాయకులకు బదులుగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని జోగి రమేష్‌ గుర్తు చేశారు. ఉచిత విద్యుత్, తెల్ల రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఇళ్ల స్థలాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పక్కా ఇళ్లు, 108 సేవలు అందరికీ అందాయన్నారు. టీడీపీ నేతలు 175 నియోజకవర్గాలు తమవే అని ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు ఇంటింటికీ ఎందుకు బయల్దేరానని నిలదీశారు. ఉద్యోగాల కోసం కర్ణాటకకు వెళ్లిన ఏపీ నిరుద్యోగుల దరఖాస్తులు చించేస్తుంటే ఎన్‌డీఏ సర్కారులో భాగస్వామిగా కొనసాగుతున్న చంద్రబాబుకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. తుంగభద్ర, ఆల్మటి నుంచి నీళ్లు అడిగేందుకు నోరు ఎందుకు పెగలడం లేదని బాబుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజనలో సోనియాగాంధీ ఎదుట సాగిలపడ్డారని చంద్రబాబును విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్‌ టీయూసీ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.శివారెడ్డి, సీటీ బీసీ సెల్‌ అధ్యక్షుడు బోను రాజేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)