amp pages | Sakshi

భూసర్వే చేపడితే ఊరుకోం

Published on Tue, 05/24/2016 - 01:31

రణస్థలం: కొవ్వాడ అణువిద్యుత్ పార్క్ నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా కోటపాలెంలో భూసర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ అణుపార్కు నిర్మించవద్దని, భూములు సర్వే చేయవద్దని తేల్చిచెప్పారు. అణువిద్యుత్ పార్క్ నిర్మాణం కోసం కోటపాలెం గ్రామంలో సోమవారం నుంచి అధికారులు భూసర్వేలు చేయనున్నారని తెలుసుకున్న సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి, నాయకులు ఎన్‌వీ రమణ, శ్యాంసుందరతో పాటు మరికొంతమంది సీఐటీయూ నాయకులు ఉదయాన్నే కోటపాలెం గ్రామస్తులతో సదస్సు నిర్వహించారు.

అధికారులు మాయమాటలు చెప్పి భూసర్వేలు చేపడుతున్నారని, సర్వేలు అనంతరం నోటీసులు జారీచేసి బలవంతంగా భూములు లాక్కోవటమే కాకుండా గ్రామాలను ఖాళీచేయిస్తారని చెప్పారు. ఈ సమయంలో కొవ్వాడ భూసేకరణాధికారి, డెప్యూటీ కలెక్టర్ జె.సీతారామారావు, తహసీల్దార్ ఎం.సురేష్ కోటపాలెం గ్రామంలోకి విచ్చేశారు. వారి వాహనాలకు అడ్డంగా సీఐటీయూ నాయకులు, గ్రామస్తులు నిల్చొని నినాదాలు చేశారు. భూసర్వేలు నిలిపివేయాలని, అణువిద్యుత్ పరిశ్రమ మాకు వద్దని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా డెప్యూటీ కలెక్టర్ జె.సీతారామారావు వాహనం దిగి గ్రామస్తులతో మాట్లాడారు. కొవ్వాడ అణుపార్క్ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలగదని అందరికీ న్యాయం చేస్తామని  తెలిపారు. ప్రమాదకరమైతే ప్రభుత్వం అనుమతులు జారీచేయదన్నారు. భూసర్వేలకు సహకరించాలని కోరారు. అయితే గ్రామస్తులు మాత్రం తమకు అణువిద్యుత్ పార్క్‌వద్దు, సర్వేలు వద్దని తేల్చిచెప్పేశారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ అణుపార్క్‌ను నిర్మిస్తే ఈ ప్రాంతం సర్వనాశనం అవుతుందని ఇటువంటి ప్రమాదక పరిశ్రమలకు భూసర్వేలు చేపడితే చూస్తూ ఊరుకునేదిలేదని అన్నారు.

అధికారులు ఎంత నచ్చచెప్పినా స్థానికులు, సీఐటీయూ నాయకులు ఒప్పుకోకపోవటంతో అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా రణస్థలం ఎస్సై వి.సత్యనారాయణ, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి మాట్లాడుతూ కోటపాలెంలో రెండురోజుల్లో గ్రామసభను నిర్వహించి అనంతరం సర్వేలను ప్రారంభిస్తామని చెప్పారు.

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)