amp pages | Sakshi

యంత్రాలతో కుతంత్రం

Published on Wed, 03/20/2019 - 11:58

సాక్షి, గరివిడి (చీపురుపల్లి): జిల్లాలో పారిశ్రామిక రంగానికే వన్నె తెచ్చిన గరివిడి ఫేకర్‌లో కార్మికులు, యాజమాన్యం మధ్య తలెత్తిన విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కార్మికులను తప్పించి యంత్రాలతో పని చేయించేందుకు యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.


హైకోర్టు తీర్పు బేఖాతరు
ఫేకర్‌ పరిశ్రమలో వేగన్, లారీ లోడింగ్‌ కార్మికులు 114 మంది, అన్‌లోడింగ్‌ కార్మికులు 132 మంది, స్టోరేజ్‌ కార్మికులు 23 మంది మొత్తం 269 మంది కొన్నేళ్లుగా (తాత, తండ్రుల కాలం నుంచి వంశపారంపర్యంగా) ఫేకర్‌ను నమ్ముకుని పనిచేస్తున్నారు. వారిని తొలగించి యంత్రాలతో పనిచేసే ప్రయత్నం యాజమాన్యం గతంలో చేసింది. దీంతో కార్మికులు ఏకమై హైకోర్టులో కేసు వేయగా వారికి అనుకూలంగా 2012 డిసెంబర్‌ 31న తీర్పు వచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

ఆ వెంటనే యాజమాన్యం కూడా వారిపై కేసులు వేసింది. ఈ తంతు జరుగుతుండగా కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఫేకర్‌ యాజమాన్యం 2014 ఫిబ్రవరిలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అర్థంతరంగా ఫ్యాక్టరీని నిలిపి వేసింది. అప్పటి నుంచి సుమారు 43 నెలలు (ఏడాదిన్నర పాటు) లాకౌట్‌లో ఉంది. 2014 డిసెంబరు 9న హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో వారిని విధుల్లోకి తీసుకోక తప్పలేదు. అయినా కోర్టు ఆదేశాలను ధిక్కరించి 43 నెలలు మూసివేసింది. మళ్లీ 2016 సెప్టెంబర్‌ 16న పరిశ్రమను తెరిచినా కార్మికులను పనుల్లోకి మాత్రం తీసుకోలేదు.  


144వ సెక్షన్‌ విధింపు
తమ సమస్యను కార్మిక శాఖమంత్రి, నారా లోకేష్, జిల్లా మంత్రి రంగారావు,  ఎమ్మెల్యే కిమిడి మృణాళిని, కలెక్టర్, కార్మిక శాఖాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా బేఖాతరు చేస్తున్నారని కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కనీసం తమ గోడును వినిపించుకోవడానికి సైతం వీల్లేకుండా గరివిడి పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకమై 144వ సెక్షన్‌ విధించారని కార్మికులు వాపోతున్నారు. ప్రస్తుతం పోలీసు పహరాలో ఫేకర్‌లో యంత్రాలతో పనులు జరుగుతున్నాయి.

269 మంది కార్మికులకు గండం
వేగన్, లారీ లోడింగ్‌ అన్‌లోడింగ్‌ కార్మికులను ఫేకర్‌ నుంచి బయటికి పంపించి వారి స్థానంలో యంత్రాలతో పని చేసుకునేందుకు ఫేకర్‌ యాజమాన్యం మళ్లీ సిద్ధపడింది. ఇప్పటికే యంత్రాలతో పనులు చేయిస్తోంది. కార్మికులు అడ్డుకుంటారన్న సందేహంతో పోలీస్‌ రక్షణలో యంత్రాలతో పనులు కొనసాగిస్తున్నారు. ఫేకర్‌ యాజమాన్యం నిర్ణయం వల్ల 269 మంది వేగన్, లారీ లోడింగ్‌ అన్‌లోడింగ్‌ కార్మికులు రోడ్డున పడనున్నారు.

మంత్రికి చెప్పినా శూన్యం
ఫేకర్‌లో పనిచేస్తున్న వేగన్, లారీలోడింగ్, అన్‌లోడింగ్‌ కార్మికులు సమస్యలను కార్మిక సంఘాల నేతలు జిల్లా మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావుకు విన్నవించారు. 144వ సెక్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని అదే రోజు మంత్రి ఆదేశించినా అమలు కాలేదు.
– రాజాన రమణ, కార్మిక సంఘాధ్యక్షుడు 

వెనక్కి తగ్గేది లేదు
ఫేకర్‌ యాజమాన్యం సమస్యను నిర్వీర్యం చేసేందుకు శత విధాలుగా  ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు సమస్య తీసుకెళ్లాం. నిరసనలు, దీక్షలు ఆపేందుకు యాజమాన్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తాం. అవసరమైతే సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించి కార్మికుల హక్కులను కాపాడుకుంటాం. యాజమాన్యం బెదిరింపులకు భయపడం.
– గంటా పాపారావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్, కార్మిక సంఘం

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)