amp pages | Sakshi

టీడీపీ దాష్టీకం

Published on Sat, 07/05/2014 - 04:28

దేవరపల్లి : దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్‌కు 12 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎన్నిక ప్రక్రియను రసాభాస చేసిన టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక వాయిదా వేయించటంలో కృతకృత్యులయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తదుపరి ఎన్నిక నిర్వహించే తేదీని ప్రకటిస్తామని ఎన్నికల అధికారి ఎంవీ రామారావు ప్రకటించారు.

ఎన్నిక సందర్భంగా శుక్రవారం టీడీపీ కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలపై దాడికి దిగటం, ఫర్నిచర్ ధ్వసం చేయటం వంటి ఘటనలకు పాల్పడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని సమావేశ మందిరంలోని వెళ్లారు. అనంతరం టీడీపీ ఎంపీటీసీ సభ్యులు వచ్చి వారి స్థానాల్లో కూర్చున్నారు. కో-ఆప్షన్ సభ్యుని ఎన్నికకు ఎన్నికల అధికారి సభ్యులతో సంతకాలు తీసుకుంటుండగా టీడీపీ కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకొని బందపురం స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి పి.సుబ్బారావు బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోంటంతో రెండు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి.

ఆ సమయంలో కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయం తలుపులు పగులగొట్టి సమావేశ మందిరంలోకి ప్రవేశించారు. తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని ఎన్నికల అధికారులను నిలదీశారు. వారు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలపై దౌర్జన్యానికి దిగారు. కూర్చున్న కుర్చీలను లాగేసి విరగ్గొట్టారు. ఈ సంఘటనతో వైసీపీ ఎంపీటీసీలు, అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిని అక్కడే ఉన్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చూస్తూ కూర్చున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా బయటకు పంపించేశారు. రోడ్డుపై ఇరు వర్గాలు బాహాబాహీకి దిగటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. సుమారు 4 గంటలు ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.
 
ఎంపీ మురళీమోహన్ రాక
సాయంత్రం సుమారు 5 గంటలకు ఎంపీ మాగంటి మురళీమోహన్ మండల పరిషత్ కార్యాలయానికి రావటంతో వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారు మెయిన్ గేటు నుంచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీవెంటనే వెళ్లిపోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. కొద్ది  సేపటికి ఎంపీ కారులో తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకొని రాళ్ల రువ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి.  డీఎస్సీ వి.రాజగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీ చార్జి చేసి వారిని చెదరగొట్టారు.

పోలీస్ బందోబస్తు తక్కువ ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు విమర్శించారు. రెండు రోజుల ముందు నుంచి పోలీసులక మొరపెట్టుకున్నా బందోబస్తు విషయంలో విఫలమయ్యారని అధికారులు వాపోయారు. సాయంత్రం 5 గంటలకు కో-ఆప్షన్, ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి రామారావు ప్రకటించడంతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు.
 
దేవరపల్లిలో 144 సెక్షన్
ఈ ఘర్షణల కారణంగా దేవరపల్లిలో 144 సెక్షన్ విధించినట్టు తహసిల్దార్ అక్బర్ హుస్సేన్ తెలిపారు.
 పోలీసుల రక్షణలో మండల పరిషత్ కార్యాలయంఎంపీపీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణం కారణంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసు భద్రత ఏర్పాటు చే శారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)