amp pages | Sakshi

బుకింగే.. డెలివరీ లేదు

Published on Wed, 10/15/2014 - 01:10

 ‘ఇసుక కష్టాలకు ఇక కాలం చెల్లింది. మీ సేవా కేంద్రంలో సొమ్ము చెల్లించడమే ఆలస్యం. క్షణాల్లో ఇసుక మీ ముందు ప్రత్యక్షం. సరసమైన ధరకు.. నాణ్యమైన ఇసుకను సొంతం చేసుకోవచ్చు. భవనాలు, ఇతర నిర్మాణాలను  చకచకా పూర్తి చేసేయొచ్చు. ఇదిగో ఇక్కడ ర్యాంపు తెరిచేశాం. ఇసుక కష్టాలకుమంగళం పాడేశాం’ కొవ్వూరు మండలం గోంగూరదిబ్బలో ఇసుక ర్యాంపును ప్రారంభించిన సందర్భంగా వెలువడిన అధికారిక ప్రకటన ఇది. ఇది తెలిసి ఇసుక అవసరమైన వారంతా తెగ సంబరపడ్డారు. ఇసుక కోసం మీ సేవా కేంద్రాల్లో సొమ్ము చెల్లించేందుకు క్యూ కట్టారు. తీరా అక్కడ చెబుతున్న విషయూలను విని, పరిస్థితులను చూసి నివ్వెరపోతున్నారు.
 
 తాడేపల్లిగూడెం/తణుకు అర్బన్/ద్వారకాతిరుమల : ఎట్టకేలకు కొవ్వూరు మండలంలోని గోంగూరదిబ్బలో ఇసుక ర్యాంపు తెరుచుకుంది. అధికారికంగా ఇసుక విక్రయూలు ప్రారంభమయ్యూయని రాష్ట్ర గనుల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రకటించారు. ఇసుక ర్యాంపులను మహిళా సంఘాలకు కేటారుుం చడం ద్వారా ఆ సంఘాల్లోని వారికి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని, అవసరమైన వారికి తక్కువ ధరకే ఇసుకు లభిస్తుందని పేర్కొన్నారు. ఇసుక కోసం ఇన్నాళ్లూ నిరీక్షించిన వారంతా ఇది నిజమనుకుని మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇసుక కోసం సొమ్ములు చెల్లిస్తున్నారు. కానీ.. ఇసుక మాత్రం డెలివరీ కావడం లేదు. పైగా రవాణా చార్జీలు, మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్ లేదా ప్రోత్సాహ కాల భారం కొనుగోలుదారులపైనే వేస్తుండటంతో ఇసుక కోసం సొమ్ము కట్టేందుకు వెళ్తున్న వారంతా నివ్వెరపోతున్నారు.
 
 బ్లాక్ మార్కెట్ ధరకే..
 ఇప్పటివరకూ ఇసుక మొత్తం బ్లాక్ మార్కెట్‌లోనే దొరికింది. ధరలు 10నుంచి 20 రెట్లు పెరిగిపోయూరుు. ప్రభుత్వమే అధికారికంగా ఇసుక విక్రయూలకు ఏర్పాట్లు చేయడంతో ధరలు దిగివస్తాయని అంతా భావించారు. తీరాచూస్తే బ్లాక్ మార్కెట్ ధరకే ఇసుక కొనాల్సి వస్తోంది. ఇసుకను రవాణా చేసేందుకు దూరాన్ని బట్టి ఇంత అని వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఇసుకను రవాణా చేసే వాహన యజమానులకు కిలోమీటరుకు రూ.60 చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ.. కిలోమీటరుకు రూ.80 చొప్పున వసూలు చేస్తున్నారు. క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.650గా ప్రభుత్వం నిర్ణరుుంచింది. మూడు క్యూబిక్ మీటర్ల ఇసుకను కలిపితే ఒక యూనిట్ అవుతుంది. ఈ లెక్కన చూస్తే యూనిట్ ఇసుక ధర రూ.1,950 అవుతోంది. కిలోమీటరుకు రూ.80 చొప్పున రవాణా చార్జీలను కలుపుకుంటే తడిసి మోపెడు అవుతోంది. అధికారికంగా ర్యాంప్‌ను ప్రారంభించినా.. సొమ్ము కట్టిన వారిలో ఒక్కొరికైనా ఇప్పటివరకూ ఇసుక డెలివరీ కాలేదు.
 
 దారి దోపిడీ ఇలా
 కొవ్వూరు సమీపంలోని ఔరంగాబాద్ ర్యాంప్ నుంచి తాడేపల్లిగూడెంకు ఇసుక తెచ్చుకోవాలంటే తొమ్మిది క్యూబిక్ మీటర్ల (మూడు యూనిట్లు) కోసం రూ.5,850 చెల్లించాలి. ఔరంగాబాద్‌కు తాడేపల్లిగూడెం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. కిలోమీటరుకు రూ.80 చొప్పున రవాణా ఛార్జీల రూపంలో రూ.3,680 వెచ్చించాల్సి వస్తోంది. మీ సేవా కేంద్రంలో సర్వీస్ చార్జి రూ.25 చెల్లించాలి. అంటే మూడు యూనిట్ల ఇసుకను తాడేపల్లిగూడెం తెచ్చుకోవాలంటే రూ.9,555 వెచ్చించాలి. బ్లాక్ మార్కెట్‌లో ఇంతకంటే తక్కువ ధరకే లభిస్తోంది.
 
 వాత ఇలా...
 కిలో మీటరుకు రూ.60 చొప్పున చెల్లించేలా వాహన యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం వినియోగదారుల నుంచి రూ.80 చొప్పున వసూలు చేస్తోంది. రవాణా ఛార్జీల రూపంలో కిలోమీటరుకు రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్న మొత్తాన్నే ర్యాంపులను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రోత్సాహకంగా అందించేందుకు ప్రభుత్వం పథకం వేసింది. ర్యాంపుల నిర్వహణలో మహిళా సంఘాల సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం నేరుగా ఒక్క పైసా కూడా వారికి చెల్లించకుండా, వారికి అందించే ప్రోత్సాహకాల మొత్తాన్ని రవాణా ఛార్జీల రూపంలో వినియోగదారుడి నెత్తిన వేస్తోంది. సొమ్ము పోతే పోయింది.. కనీసం ఇసుక అరుునా రావడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గోంగూర దిబ్బ, తాడిపూడి, ఔరంగాబాద్, పందలపర్రు ర్యాంప్‌ల నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వేలాది మంది సొమ్ము చెల్లించినా, వారిలో ఒక్కరికి కూడా సరఫరా కాలేదని చెబుతున్నారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌