amp pages | Sakshi

జగన్‌ జన్మదినోత్సవం సందర్భంగా మెగా వైద్య శిబిరాలు 

Published on Sun, 12/16/2018 - 04:09

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య ఆయా ప్రాంతాల్లో పార్టీ వైద్య విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో దీనికి సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను శనివారం ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మెగా వైద్య శిబిరాలను ఈ నెల 18న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో, 17న ప్రకాశం జిల్లా కొండపిలో, 18న గన్నవరంలో, 19వ తేదీ ప్రకాశం జిల్లా చీరాల, 20న విశాఖపట్నం, విజయవాడ నగరాలలో, 21న పలాస, నగరి, 22న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం నుంచి 50 మంది డాక్టర్లు ఈ శిబిరాల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం స్ఫూర్తి అని పేర్కొన్నారు. వచ్చే ఐదారు నెలల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మినీ వైద్య శిబిరాలను ప్రతినెలా నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వైద్య విభాగం అధ్యక్షుడు డా. జి.శివభరత్‌రెడ్డితో పాటు డా. అశోక్, డా. ప్రసాద్, డా. బాషా, డా. గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌