amp pages | Sakshi

మెట్రో రైలు నివేదిక తయారీలో జాప్యం

Published on Tue, 04/29/2014 - 00:59

  •     రూ.5వేల కోట్ల ప్రాజెక్ట్
  •      ఎన్నికల కోడ్‌తో అడ్డంకి
  •      కోడ్ తర్వాతే డీపీఆర్‌పై టెండర్లు
  •  సాక్షి, విశాఖపట్నం : జీవీఎంసీలో మెట్రో రైలు ప్రాజెక్టుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) తయారీ ప్రక్రియ జాప్యం కానుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే డీపీఆర్ తయారీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపినా అమలుకు నోచుకోలేదు. తీరా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. దీంతో డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచేందుకు ఆటంకాలేర్పడ్డాయి. కానీ ఎన్నికల సంఘం అనుమతితో డీపీఆర్ టెండర్లను పిలిచేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘానికి నివేదించారు.
     
    టెండర్ ఖరారైతే నెలలోగా డీపీఆర్
     
    ఇప్పటికే జీవీఎంసీలో ఏయే ప్రాంతాలు మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుకూలంగా ఉన్నాయో  ప్రాథమిక నివేదికను రూపొందించారు. దాన్ని ప్రభుత్వానికి అందించారు. దీని ఆధారంగానే ప్రభుత్వం విశాఖలో మెట్రో ప్రాజెక్టుకు అనుమతించింది. సుమారు రూ.5వేల కోట్లతో దీన్ని చేపట్టేందుకు ప్రతిపాదించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏకంగా 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే అందించేందుకు ముందుకొచ్చింది. దీంతో యుద్ధప్రాతిపదికన జీవీఎంసీ ఏర్పాట్లు చేసింది. ఈలోగానే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
     
    కానీ పురపాలన పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) నుంచి మాత్రం దీనిపై చర్యలు వేగవంతం చేయాలన్న ఆదేశాలతో ఎన్నికల సంఘానికి విషయాన్ని నివేదించారు. ఎన్నికల సంఘం అనుమతిస్తే టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఢిల్లీ మెట్రోరైలు బోర్డు ఉత్సాహం చూపుతోంది. అయితే గ్లోబల్ టెండర్లు పిలవాలన్న ఉన్నతాధికారుల సూచనతో ఎన్నికల సంఘం ఆమోదం మేరకు ఆ దిశగా జీవీఎంసీ చర్యలు తీసుకోనుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయితే.. నెల రోజుల్లో డీపీఆర్ సిద్ధమవుతుందని జీవీఎంసీ యంత్రాంగం చెప్తోంది. డీపీఆర్ సిద్ధమయితే ఏయే ప్రాంతాల మీదుగా మెట్రో ప్రాజెక్టు ఏర్పాటయ్యేదీ తేలనుంది.
     

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)