amp pages | Sakshi

‘మెట్రో’ నివేదిక బాధ్యత డీఎంఆర్‌సీకి

Published on Wed, 09/10/2014 - 03:02

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. ఆర్థిక శాఖ ఆమోదం!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) పరిధిలో, విశాఖ, తిరుపతి ల్లో ఏర్పాటు చేయనున్న మెట్రో రైలు ప్రాజెక్టుల కీలకమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎంఆర్‌సీ మాజీ ఎండీ శ్రీధరన్ ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులకు పనిచేసేందుకు ఇటీవలే అంగీకరించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్ బాధ్యతలను కూడా డీఎంఆర్‌సీకే అప్పజెపితే బావుంటుందన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. ఇందుకు ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్‌టీఎస్)లో భాగంగా విజయవాడ (వీజీటీఎం పరిధి), విశాఖపట్నం నగరాల్లో 4 కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో వీజీటీఎం పరిధిలో 49 కిలోమీటర్లు, విశాఖపట్నంలో 20 కిలోమీటర్లు నిర్మించనున్నారు.

వీజీటీఎం, విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్లకు చైర్మన్‌లు, డెరైక్టర్లను గత నెల 13వ తేదీనే ప్రభుత్వం నియమించింది. వీటితోపాటు తిరుపతి నగరంలోనూ ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నగరాల్లో ఎక్కువ జనాభా, రద్దీ (ట్రాఫిక్) ఉన్న ప్రాంతాల్లో మెట్రో రైలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు తొలి అడుగుగా భావించే డీపీఆర్ బాధ్యతలను డీఎంఆర్సీ చేపట్టనుంది. ఈ సంస్థ మూడు నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు రూట్ మ్యాప్, స్థల సేకరణ, భూసార పరీక్ష (సాయిల్ టెస్టింగ్), ప్రాజెక్టు అంచనా వ్యయం తదితరమైనవన్నీ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక వచ్చాకే పనులు మొదలవుతాయి. ఇందుకోసం డీఎంఆర్‌సీ అధికారుల బృందం త్వరలోనే మూడు నగరాలకూ వస్తుందని పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి మెట్రో రైలు హైదరాబాద్ తరహాలో ఉంటుందా లేక ఢిల్లీ తరహాలోనే భూగర్భంలో నిర్మిస్తే బావుంటుందా అన్నది కూడా డీఎంఆర్‌సీ అధికారులు వారి నివేదికలో తెలుపుతారని చెప్పారు. గతంలో మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో తిరుపతి మెట్రో రైలు ప్రస్తావన లేకపోయినా, దీనికి కూడా ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసుకోవాలని, ఆ తర్వాత పరిస్థితినిబట్టి ఇక్కడ ప్రాజెక్టును చేపట్టాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది.
 
 

Videos

కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి

నర్రెడ్డి నాటకాలు చాలు

సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తానేటి వనిత ఘటన..వాసిరెడ్డి పద్మ సంచలన కామెంట్స్

పేదవాడు జీవచ్ఛవం కాకూడదని సీఎం జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు

జగనన్న వెంట ఆ ఇంటి ఆడపడుచు లేకున్నా..మేము ఉన్నాం..

ఒకసారి తిరిగి చూసుకోండి..

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?