amp pages | Sakshi

మృత్యువులోనూ వీడని బంధం

Published on Fri, 06/13/2014 - 02:32

బొండపల్లి :అర్ధరాత్రి సమయం.. అప్పటి వరకూ అయిన వారి ఇంట పెళ్లిలో సందడిగా గడిపారు. మనిషికి మనిషి తోడున్నాము కదా అని.. రాత్రయినా తమ ఇళ్లకు వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డారు. తాము వచ్చిన ఆటోలోనే తిరుగు ప్రయూణమయ్యూరు. పెళ్లి ఇంటిని వదిలి.. ఆ ఊరిని దాటి కాస్త సమయమైనా కాలేదు. ఇంతలోనే ఉరుములా వచ్చింది ఎక్కడి నుంచో మాయదారి లారీ. మృత్యువై మీద పడింది. చూస్తుండగానే ఇద్దరి ప్రాణాలను గాలిలో కలిపేసింది. ఈ విషాదకర ఘటన అందరినీ కలిచివేసింది. తీవ్రంగా బాధించింది. ప్రాణాలు పోగొట్టుకున్న ఇద్దరూ తల్లీకొడుకులు. మృత్యువులోనూ వీడని వారి బంధాన్ని చూసి అక్కడి వారు తల్లడిల్లిపోయూరు.
 
 మండలంలోని గొట్లాం మధుర గ్రామం జియన్నవలస జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి దాటాక 1.30 సమయంలో(తెల్లవారితే గురువారం) ఆటోను గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఈ ఘటనలో తల్లీకొడుకు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యూయి. క్షతగాత్రులను జిల్లా కేంద్రాస్పత్రితోపాటు, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నారుు. గొట్లాం మధుర గ్రామం జియన్నవలసలో పెళ్లి ఉండడంతో పూసపాటిరేగ మండలం యూతపేటకు చెందిన కొంతమంది అదే మండలానికి చెందిన ఆటోలో బయల్దేరారు. పెళ్లి చూసుకుని తమ స్వగ్రామానికి రాత్రి 1.30 సమయంలో బయల్దేరారు. గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ఆటో వస్తుండగా..
 
 గుర్తు తెలియని లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. ఘటన జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయూడు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పూసపాటిరేగ మండలం యూతపేటకు చెందిన గొడ్డు సంతోషి(39), ఆమె కుమారుడు అప్పలరాజు(4) తీవ్ర గాయూలపాలై సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన వడ్డి సీతయ్య, వి.అసిరినాయుడు, రీసు గౌరి, చందు, పి.రాజమ్మ, జి.గౌరి తీవ్ర గాయూలపాలయ్యూరు. వీరిని 108 వాహనంలో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అదే విధంగా రీసు రాజేష్, రీసు చిన్న, హేమలత, పి.నాగమణి, ఇ.అప్పయ్యమ్మ, రెల్లివలస గ్రామానికి చెందిన ఆటో డ్రవర్ ఇజ్జురోతు ఈశ్వరరావులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే బొండపల్లి ఎస్సై జె.తారకేశ్వరరావు సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. తల్లీకొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
 
 శోక సంద్రంలో యూతపేట
 పూసపాటిరేగ : గొట్లాం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు మృత్యువాత పడడంతో మండలంలోని యూతపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులతోపాటు క్షతగాత్రులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే వారి బంధువుల రోదనలు మిన్నంటాయి.
 

Videos

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

టీడీపీ నేతకు బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్

నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు

ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఉదాహరణలతో వివరించిన సీఎం జగన్

ఆంధ్రా అతలాకుతలం..

విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?