amp pages | Sakshi

మునిసిపల్ ఉద్యోగులతో అధికారుల చర్చలు విఫలం

Published on Thu, 10/10/2013 - 00:31

సాక్షి, హైదరాబాద్: మునిసిపల్ ఉద్యోగులు ఈనెల 17నుంచి తలపెట్టిన సమ్మెను విరమింప జేసేందుకు కార్మిక శాఖ అధికారులు బుధవారం ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 20 డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర మునిసిపల్ కార్మిక, ఉద్యోగ ఐక్య సంఘాల కార్యాచరణ సమితి ఇటీవల సమ్మె నోటీసు ఇచ్చింది. దీంతో అడిషినల్ లేబర్ కమిషనర్ సూర్యప్రకాశ్‌రావు కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఒక్కదానిపైనా ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు.

 

కాంట్రాక్ట్ కార్మికులకు డీఏతో కూడిన మూల వేతనాన్ని చెల్లించాలని, చట్టపరంగా 71 రోజుల సెలవులు ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని ఉద్యోగులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. చర్చలు ఫలితమివ్వకపోవడంతో తిరిగి ఈనెల 15న సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ చర్చల్లో కార్మిక సంఘా ల నేతలు కిర్ల కృష్ణారావు, కె.ఏసురత్నం, టి.నర్సయ్య (ఏఐటీయూసీ), పాలడగు భాస్కర్‌రావు, వెంకటేశ్ (సీఐటీయూ), కృష్ణా (ఐఎఫ్‌టీయూ), శంకర్ (బీఎంఎస్), మారుతీరావు (టీఆర్‌ఎస్ టీయూ), శ్రీనివాస్ (టీఎన్‌టీయూసీ), వైద్య శాఖ జాయింట్ డెరైక్టర్ వై.సత్యనారాయణ, ఇతర అధికారులు రఘుప్రసాద్, పాండురంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Videos

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)