amp pages | Sakshi

జగన్‌ హామీ అమలైతే మాకదే పదివేలు!

Published on Tue, 03/19/2019 - 07:41

‘వారసత్వంగా వచ్చిన వృత్తిని నమ్ముకున్న నాయీ బ్రాహ్మణుల ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు తీసుకుని సెలూన్‌ షాపు పెట్టుకుందామంటే.. ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. అద్దెలు చెల్లించలేక.. విద్యుత్‌ బిల్లులు కట్టలేక.. కుటుంబాల్ని నడపలేక మేం పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. బతుకు భారం కావడంతో ఎందరో యువకులు వలస పోతున్నారు’ అని నాయీ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ‘సాక్షి’ రచ్చబండలో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనేతమ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. పిరిడి రమేష్‌ మాట్లాడుతూ.. ‘ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ మా కష్టాలన్నీ విన్నారు. అధికారంలోకి రాగానే సెలూన్‌ షాపులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని వాగ్దానం చేశారు.ఈ భరోసా మాకెంతో ఊరటనిచ్చింది’ అని చెప్పారు. నాయీ బ్రాహ్మణులను కళాకారులుగా గుర్తించి పింఛన్లు ఇస్తే మేలు కలుగుతుందని అలజంగి శంకరరావు పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణుల మనోభావాలు వారి మాటల్లోనే..– బంకపల్లి వాసుదేవరావుపార్వతీపురం

ఉచిత కరెంట్‌తో ఊరట
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయీ బ్రాహ్మణుల కష్టాలు తెలుసుకొని 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ భరోసా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఊరట కలిగించింది. చాలామంది నాయీ బ్రాహ్మణులు కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ హామీ మా అందరి జీవితాల్లో ధైర్యాన్ని నింపింది.– పిరిడి రమేష్, పార్వతీపురం

సామాజిక భవనాలుకట్టిస్తే బాగుంటుంది  
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆదుకుంటానని భరోసా ఇవ్వడం ఆనందం కలిగించింది. మా సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉంది. నాయీ బ్రాహ్మణులకు ఎక్కడా సామాజిక భవనాలు లేవు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున నిర్మిస్తే బాగుంటుంది. జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాం.– ముసిడిపల్లి రమణ, డైరెక్టర్,రాష్ట్ర నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌

ష్యూరిటీ లేని రుణాలివ్వాలి
ష్యూరిటీ ఉంటేనే గాని బ్యాంకర్లు రుణాలివ్వడం లేదు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక.. ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.50 వేల వరకు రుణ సహాయం చేస్తే నాయీ బ్రాహ్మణ యువతకు స్థానికంగానే ఉపాధి దొరుకుతుంది. ఆ దిశగా వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకోవాలి. ఆయనకు మేమంతా అండగా ఉంటాం.– అమరాపు మురళి,చినబొండపల్లి

పెన్షన్లు ఇవ్వాలి
మాలో చాలామంది వివాహ, శుభకార్యాలకు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటారు. ఇలాంటి వారిని కళాకారులుగా గుర్తించి పింఛన్లు ఇస్తే మేలు కలుగుతుంది. నాయీ బ్రాహ్మణులకు ఏటా రూ.10 వేల లబ్ధి, ఉచిత కరెంటు ఇస్తామన్న వైఎస్‌ జగన్‌ హామీ ఎంతో మేలు చేస్తుంది. పింఛన్‌ ఇస్తే మరింత మేలు కలుగుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం.– అలజంగి శంకరరావు,చినబొండపల్లి

మా సొంతింటి కలనుజగన్‌ నెరవేరుస్తారు..
సొంత ఇల్లు, స్థలం లేని నాయీ బ్రాహ్మణులకు గృహ నిర్మాణం పథకం అమలు చేయాలి. ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టి ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అర్హులైన నాయీ బ్రాహ్మణులందరికీ సొంతింటి కలను నెరవేరుస్తారన్న ఆశతో ఉన్నాం.– గండ్రేటి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి,నాయీ బ్రాహ్మణ సంఘం

నాణ్యమైనపరికరాలు ఇవ్వాలి
నాయీ బ్రాహ్మణుల్లో ఎక్కువ మంది క్షౌ ర వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ పథకం కింద ఇచ్చిన వాయిద్య పరికరాలు, సెలూన్‌ కుర్చీలు నాసిరకంగా ఉన్నాయి. పైగా వాటిని రెట్టింపు ధరలకు ఇచ్చారు. ఆదరణ పథకంలో లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాయితీతో కూడిన నాణ్యమైన పరికరాలు కార్పొరేషన్‌ ద్వారా అందిస్తారని ఆశిస్తున్నాం.– లోచర్ల సంతోష్‌కుమార్,నాయీ బ్రాహ్మణుడు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌