amp pages | Sakshi

దిగుబడి లేదు..గిట్టుబాటు రాదు

Published on Mon, 02/05/2018 - 20:20

కారంచేడు : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అన్నదాతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాలు లేకపోవడంతో జిల్లాలో రైతన్నలను నిండా ముంచేసింది. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.11 లక్షల ఎకరాల్లో వరి, 2.57 లక్షల ఎకరాల్లో శనగ సాగు చేశారు. వరి, శనగ సాగుల్లో ప్రకాశం జిల్లా రైతులు మంచి మెళకువలు  పాటించి ఎక్కువ దిగుబడులు సాధిస్తుంటారు. కానీ వాతావరణం అనుకూలించక పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కర్షకులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. దిగుబడులు పతనమై, ధరలు దిగజారిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.


ధాన్యాగారానికి తప్పని నష్టాలు..


జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంత రైతన్నలకు ఈ ఏడాది నష్టాలు తప్పడం లేదు. గత ఏడాది వాతావరణం అనుకూలించి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయంటున్న అన్నదాతలు ఈ ఏడాది మాత్రం పంట దిగుబడుల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. గత ఏడాది దిగుబడులు బాగున్నాయి, ధరలు కూడా బాగున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడులు లేకపోగా ధరలు కూడా పతనమవడంతో ఎకరానికి కనీసం రూ.10 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని లబోదిబోమంటున్నారు.జిల్లాలోని 12 సబ్‌ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో మొత్తం శనగ సాగు 2,56,598 ఎకరాల్లో, వరిసాగు 1,10,513 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయా«ధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ఇంత ఘోరమైన దిగుబడులు గతంలో చూడలేదు


గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది శనగ సాగు ఘోరంగా ఉంది. వాతావరణం అనుకూలించపోవడంతో కాపు తగ్గిపోయింది. చెట్టు బాగా పెరిగింది. కానీ కాయలు తగ్గిపోయాయి. దీంతో దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఎకరానికి సుమారు రూ.20 వేల వరకు నష్టం వచ్చేలా ఉంది. ఒక్కో రైతు కనీసం 5 ఎకరాల వరకు సాగు చేశారు.
దగ్గుబాటి నాగశ్రీను, రైతు, కారంచేడు


వరిలోనూ నష్టపోవాల్సిందే


ఈ ఏడాది వరి సాగులో కూడా రైతులు నష్టపోవాల్సిందే. ముదురులో సాగు చేసిన చేలల్లో కనీసం 90 శాతం పంట పడిపోయింది. దీంతో గింజ రాలిపోయింది. వాతావరణం ఈ ఏడాది అన్నదాతలను నిండా ముంచేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే కనీసం 10 బస్తాల దిగుబడి తగ్గిపోగా ధరలో బస్తాకు రూ.300 వరకు తగ్గింది. దీంతో రైతులు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోవాల్సి వస్తుంది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రైతుకు కొంత ఊరటగా ఉంటుంది.
యార్లగడ్డ శ్రీకాంత్, రైతు, కారంచేడు 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)