amp pages | Sakshi

బాలలకు ‘అమృతం’

Published on Mon, 11/04/2013 - 07:10

 దేవునిపల్లి, న్యూస్‌లైన్ :

 పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం ‘అమృతం’ పంచుతోంది. మహిళా శిశుసంక్షేమ శాఖ, సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) ఆధ్వర్యంలో బాల అమృతం పేరిట ఏడు నెలల నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలకు పౌష్టికాహారం అందించనుంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే ఈ పౌడర్ ప్యాకెట్లను ఆయా కేంద్రాలకు పంపుతున్నట్లు ఐసీడీఎస్ పీడీ రాములు తెలిపారు.

 

 పదిరకాల న్యూట్రిషన్స్‌తో..

 పిల్లల కోసం పది రకాల న్యూట్రిషన్స్‌తో కూడిన 2.5 కేజీల పౌడర్‌ను ప్యాకెట్ రూపంలో పంపిణీ చేస్తున్నారు. ప్రతిరోజు వందగ్రాముల చొప్పున పిల్లలకు అందించాల్సి ఉంటుంది. ఈలెక్కన ఒక ప్యాకెట్ నెలరోజుల పాటు వస్తుంది. మూడేళ్లలో 36ప్యాకెట్‌లను ఒక్కో పిల్లాడికి పంపిణీ చేయాలి. గోధుమలు, శనగలు, రిఫైన్డ్ పామోలిన్ ఆయిల్, స్కిమ్డ్ మిల్క్‌పౌడర్, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, సీ, బీ1, బీ2, ఫోలిక్‌యాసిడ్, నియాసిన్‌లతో ఈ పౌడర్‌ను తయారుచేస్తారు. పాప పుట్టినప్పటి నుంచి ఏడునెలల వరకు పిల్లలకు తల్లిపాలు కచ్చితంగా అందించాల్సి ఉంటుంది. ఏడునెలల తర్వాత మూడేళ్ల వరకు ఈ పౌడర్‌ను అందించాలి. జిల్లాలో మొత్తం 2,410 అంగన్‌వాడీ కేంద్రాలు, అలాగే 290 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 25వేల మంది పిల్లలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

 ప్రతి పిల్లాడికి అందేలా..

 -రాములు, పీడీ. ఐసీడీఎస్

 

 పిల్లల్లో పౌష్టికాహార లోపాలు లేకుండా ఉండేందుకు బాల అమృతం పథకం ప్రారంభమైంది. ఈ ప్యాకెట్లు ప్రతి పిల్లాడికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. అంగన్‌వాడీ కార్యకర్తలు సర్వేలు నిర్వహించి, సక్రమంగా అందేలా చూడాలి. ఈ పథకాన్ని తల్లులు సద్వినియోగం చేసుకోవాలి.

 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)