amp pages | Sakshi

పచ్చధనం స్వాహా!

Published on Sun, 10/26/2014 - 03:20

సాక్షి ప్రతినిధి, అనంతపురం :
 పక్క ఫొటోలోని ట్రాక్టర్‌లో కనిపిస్తోన్న కలప గుత్తి చెరువులోనిది. ఏళ్లతరబడి ఏపుగా పెరిగిన భారీ తుమ్మ వృక్షాలు చెరువు నిండా విస్తరించి ఉన్నాయి. వీటిపై టీడీపీ నేతల కన్ను పడింది. ఇంకేముంది? అడ్డూ అదుపు లేకుండా 15 రోజులుగా వృక్షాలను నరికి విక్రయించేస్తున్నారు. చివరకు అడ్డొచ్చిన అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధి చిందులేశాడు. దీంతో అధికారులు కూడా నిశ్చేష్టులయ్యారు.
 
గుత్తి శివారు ప్రాంతంతో పాటు కొజ్జేపల్లి, లచ్చానుపల్లి గ్రామాల పరిధిలో సర్వే నెంబరు 486లో 877.57 ఎకరాల విస్తీర్ణంలో గుత్తి చెరువు విస్తరించి ఉంది. 30-50 ఏళ్ల వయస్సున్న తుమ్మ చెట్లు చెరువు అంతటా ఉన్నాయి. ప్రస్తుతం చెరువును హంద్రీ-నీవా నీటితో నింపేందుకు అధికారులు యత్నిస్తున్నారు. దీనికి చెరువులోని తుమ్మ చెట్లు అడ్డొస్తాయని భావించారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించేందుకు చిన్ననీటి పారుదల శాఖ అధికారులు డ్వామాకు సిఫార్సు చేశారు. కంపచెట్లు తొలగింపు మాత్రమే ఉపాధి హామీ ద్వారా చేపట్టొచ్చని, చెట్లను నరికేసేందుకు కుదరదని డ్వామా అధికారులు తిరస్కరించారు.

 నిబంధనలు ఇవీ!
 చెరువులోని చెట్లను నరికేసేందుకు మొదట అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఆపై పంచాయతీ,  కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలి. తర్వాత టెండర్ పిలవాలి. టెండర్ దక్కించుకున్న వారు చెట్లను నరికి విక్రయించుకోవచ్చు. తద్వారా వచ్చిన ఆదాయంలో 50 శాతం గ్రామ పంచాయతికి ముట్టజెప్పాలి. తక్కిన 50 శాతం ‘పర్యావరణ పరిరక్షణ’ కింద చెరువు గట్టు, చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు ఖర్చు చేయాలి.

 15 రోజులుగా ఇలా జరుగుతోంది..
 చె రువులోని వృక్ష సంపదపై టీడీపీకి చెందిన నియోజకవర్గ స్థాయి నేత కన్ను పడింది. ఎలాంటి అనుమతి లేకుండా తన అనుచరులతో వారం రోజులుగా చెట్ల నరికివేతకు ఉపక్రమించాడు. ఇదేంటని ప్రశ్నించిన కొందరు అధికారులపై రుబాబు చేశారు. ‘ఏం.. నీకేంటి పని.. నేను కలెక్టర్‌తో అనుమతి తీసుకున్నా.. నీకు చెప్పాల్సిన పనిలేదు.. దీంట్లో వేలు పెట్టొద్దు జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు. దీంతో అధికారులు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధి వ్యవహారంతో మనకెందుకులే అన్నట్లు.. చూసీ చూడనట్లు వ్యవహరించారు.

ఈ క్రమంలో రోజుకు 40 మంది కూలీల చొప్పున ఇప్పటి వరకు 30 ఎకరాల్లో చెట్లను నరికించారు. ట్రాక్టర్లలో తరలించి బహిరంగ మార్కెట్లో విక్రయించారు. వచ్చిన సొమ్మును జేబులో వేసుకున్నారు. వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో కొజ్జేపల్లి సర్పంచ్ మహేశ్వరప్ప నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో ఫారెస్ట్ అధికారులు కూడా నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు శనివారం నీటి పారుదల శాఖ జేఈ షబ్నమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ సంబంధిత అధికారులను సంప్రదిస్తే.. శుక్రవారం వరకూ చెట్లు నరికేస్తున్నారనే సంగతే తమకు తెలీదని చెప్పడం గమనార్హం.
 
 పోలీసులకు ఫిర్యాదు చేశాం

 కొజ్జేపల్లి సర్పంచ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు చెరువులోకి వచ్చి కూలీలను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై పూర్తి విచారణ చేపడతామన్నారు. ఇప్పటి వరకూ నరికేసిన చెట్లను వేలం వేయాలని నిర్ణయించుకున్నాం. కలెక్టర్ అనుమతి రాగానే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం.     - షబ్నమ్, జేఈ, చిన్న నీటి పారుదల శాఖ.
 
 మా అనుమతి తీసుకోలేదు
 చెరువులో చెట్లను నరికేసేందుకు మా అనుమతి తీసుకోలేదు. దీనిపై నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం. చెట్లు మా పరిధిలోకి రావు. నీటి పారుదల శాఖ పరిధిలోకి వస్తాయి. కానీ అనుమతి మాత్రం అటవీ శాఖ నుంచి కూడా తీసుకోవాలి.          - డేవిడ్, ఫారెస్ట్ ఆఫీసర్, గుత్తి రేంజ్.
 
 కలెక్టర్ అనుమతి ఉందని చెబుతున్నారు
 జేఈ షబ్నమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూలీలను అదుపులోకి తీసుకుని విచారించాం. కూలీలు కొందరి పేర్లు చెప్పారు. చెట్లను నరికేందుకు కలెక్టర్ అనుమతి కూడా ఉందన్నారు. ఇదే విషయాన్ని జేఈ షబ్నమ్‌కు చెప్పాం. అనుమతి పత్రాన్ని తీసుకురావాలని సూచించాం. ఎవరూ చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నాం.          -రమణారెడ్డి, ఎస్‌ఐ, గుత్తి.

#

Tags

Videos

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)