amp pages | Sakshi

పెథాయ్‌ ప్రత్యేకత

Published on Tue, 12/18/2018 - 02:05

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: సాధారణంగా తుపాన్లు సముద్ర తీర ప్రాంతంలో భూమిని తాకుతాయి. భూ ఉపరితలంపై కొద్ది దూరం ప్రయాణించాక బలహీనపడిపోతాయి. కానీ, సోమవారం తూర్పు గోదావరి తీరాన్ని తాకిన పెథాయ్‌ తుపాను మిగతా వాటికి భిన్న మైనది. ఇది తీరాన్ని దాటిన తర్వాత దిశను మార్చుకొని, సముద్రంలోకి వెళ్లింది. మళ్లీ రాత్రికి తూర్పుగోదావరిలోని తుని వద్ద రెండో సారి తీరాన్ని తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెథాయ్‌ తొలుత సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కాట్రేనికోన – యానాంల మధ్య సోమవారం మధ్యాహ్నం తీరాన్ని దాటింది.

వాస్తవానికి తుపాను తీరాన్ని దాటి భూమిపైకి వచ్చాక బలహీనపడుతుంది. అంతా అలాగే అనుకున్నారు. కానీ కాసేపటికే దిశను మార్చుకొని యానాం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వెళ్లింది. సముద్రం మీదుగా ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండంగా బలహీనపడి సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కాకినాడకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ సోమవారం రాత్రి తుని వద్ద రెండోసారి తీరాన్ని తాకింది. ఇలా ఒకే తుపాను రెండుసార్లు భూమిని తాకడం చాలా అరుదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సముద్ర తీరం వంపు కలిగి ఉండటం, తుపాను తన దిశను వేగంగా మార్చుకోవడం వల్ల ఈ విధంగా జరిగిందని నిపుణులు చెబుతున్నారు. 

ఇది చాలా అరుదు
ఇలాంటి ఘటనలు దశాబ్దాల తర్వాత సంభవిస్తుంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబరు నెలలో ఉపరితల గాలుల ప్రభావం వల్ల తుపానులు తీరం దాటాక కూడా దిశ మార్చుకోవడంతో ఇలాంటి పరిస్థితులేర్పడతాయని వాతావరణశాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. 1970 దశకంలో ఇలాగే జరిగిందని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి ఒకరు వివరించారు. ‘సాధారణంగా తుపాను ఒకసారే తీరం దాటుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకే తుపాను రెండుసార్లు కూడా తీరం దాటుతుంది. తాజాగా వచ్చిన ‘పెథాయ్‌’ కూడా అలాగే దాటింది. అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు ఇందుకు కారణం. పెథాయ్‌ తుపాను కాకినాడ – యానాం మధ్య తీరం దాటింది. ఈ ప్రాంతంలో భూమి ఆంగ్ల అక్షరం తిరగబడిన ‘యు’ ఆకారంలో సముద్రం లోపలకు ఉండి తిరిగి వెలుపలకు ఉంది. భూమి సముద్రం లోపలకు ఉన్న ప్రాంతంలో తుపాను తీరం దాటి అదే మార్గంలో వెళ్లడంతో మళ్లీ సముద్రంలోకి వెళ్లినట్లయింది. కొద్దిదూరం పోయిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి మరోసారి తీరాన్ని దాటింది. ఇలా అరుదుగా జరుగుతుంటాయి’ అని ఐఎండీ హైదరాబాద్‌ కేంద్రం అధికారులు వైకే రెడ్డి, నాగరత్న ‘సాక్షి’కి వివరించారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)