amp pages | Sakshi

పీజీ డెంటల్ కౌన్సెలింగ్ గందరగోళం

Published on Fri, 07/11/2014 - 02:09

  • ఆపాలని కొంతమంది..
  •  కొనసాగించాలని  మరికొంతమంది
  •  విద్యార్థుల్లో టెన్షన్..టెన్షన్
  •  ఎట్టకేలకు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభ ం
  • విజయవాడ : డెంటల్ పోస్టుగ్రాడ్యుయేషన్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మరలా నిర్వహించాలని కొందరు.. కౌన్సెలింగ్ నిర్వహించేందుకు చివరి రోజు కావడంతో ఏమి జరుగుతుందోననే ఆందోళనలో మరికొందరు విద్యార్థులతో సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. డెంటల్ పీజీ ప్రవేశ పరీక్ష ‘కీ’లో ఏడు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చారని, డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డితో పాటు మరో ఆరుగురు హైకోర్టును ఆశ్రయించడంతో, కౌన్సెలింగ్‌ను నిలిపివేసి, ప్రశ్నాపత్రాలు పరిశీలించాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది.

    దీంతో ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అప్పటికే పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థుల్లో ఆందోళన ప్రారంభమైంది. హైకోర్టు నుంచిస్టే వచ్చిందని ప్రచారం జరగడం, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం గురువారం నాటికి కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉన్నందున్న కౌన్సెలింగ్ జరగకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళనకు గురయ్యారు.

    అదే సమయంలో కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు సైతం ప్రవేశ పరీక్ష కీలో తప్పుగా సమాధానాలు ఇచ్చారని, దీంతో ర్యాంకులు తారుమారయ్యాయంటూ ఆందోళన ప్రారంభించారు.    కాగా హైకోర్టు ఆదేశాల మేరకు వ ర్సిటీ అధికారులు హైదరాబాద్, విజయవాడ డెంటల్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ బాలిరెడ్డి, డాక్టర్ టి.మురళీమోహన్‌లతోకూడిన ఎక్స్‌పర్ట్ కమిటీ ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం 12 గంటలకు కౌన్సెలింగ్‌ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

    దీంతో కోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న డాక్టర్ శశాంక్ వద్దకు వెళ్లి కోర్టు ఇచ్చినకాపీలను అందజేశారు. ఈ విషయంలో తామేమి చేయలేమని, వర్సిటీ అధికారులను కలిస్తే వివరణ ఇస్తారని వారు విద్యార్థులకు సూచించారు. దీంతో వారు వెనుదిరగడంతో అనంతరం కౌన్సెలింగ్‌ను కొనసాగించారు.
     

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌