amp pages | Sakshi

ర్యాగింగ్ జరిగిందని రుజువైతే...కేసు మారుస్తాం: సీఐ

Published on Sat, 11/22/2014 - 10:12

విశాఖ : విశాఖ భీమిలీలోని ఎన్ఆర్ఐ కళాశాల హాస్టల్ భవనంపై నుంచి పడి గాయపడిన ఫార్మసీ విద్యార్థి ప్రశాంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈనెల 19న ప్రశాంత్ భవనం పైనుంచి పడిపోయిన విషయం తెలిసిందే. అతడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేర్ ఆస్పత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. మరోవైపు ర్యాగింగ్ వల్లే తమ కుమారుడు మృతి చెందాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ర్యాగింగ్కు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ర్యాగింగ్ తట్టుకోలేకే తన తమ్ముడు భవనంపైనుంచి దూకాడని ప్రశాంత్ సోదరి సంధ్య ఆరోపించారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చేవరకూ మృతదేహానికి పోస్ట్మార్టం చేయటానికి వీలు లేదని పట్టుబట్టారు.  కాగా ప్రశాంత్ వారం క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని.. హాస్టల్లో ఉండలేకపోతున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదని సమాచారం.

ఈ ఘటనపై భీమిలీ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ విద్యార్థి మృతిపై ప్రస్తుతం ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు. ఒకవేళ ర్యాగింగ్ జరిగిందని రుజువైతే ...ర్యాగింగ్ కేసుగా మార్చుతామని ఆయన తెలిపారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఎన్ఆర్ఐ కళాశాల యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కాగా కళాశాల యాజమాన్యం మాత్రం తమ కళాశాలలో ర్యాగింగ్ అనేదే లేదని, ప్రశాంత్ మానసిక ఒత్తిడిని తట్టుకోలేకే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని చెబుతోంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)