amp pages | Sakshi

పంచాయతీలకు ‘విద్యుత్‌’ షాక్‌..!

Published on Thu, 07/26/2018 - 12:44

ఓపైపు నిధుల లేమి, మరోవైపు ఖర్చుల భారంతో విలవిలలాడుతున్న పంచాయతీలపై విద్యుత్‌ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్ల కరెంట్‌ బిల్లులను చెల్లించాలంటూ ట్రాన్స్‌–కో అధికారులు పంచాయతీలకు నోటీసులు పంపిస్తున్నారు. 2006 నుంచి విద్యుత్‌ బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా భారీగా బకాయిలు పేరుకుపోయాయి.

మదనపల్లె రూరల్‌: జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 66 మండలాలు, 1363 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ: 7.50 కోట్ల వరకు విద్యుత్‌ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీడీఓలపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి విద్యుత్‌ కనెక్షన్లు తొలగించిన దాఖలాలు కూడా లేకపోలేదు. పంచాయతీలు బిల్లులు చెల్లించకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే విద్యుత్‌ కనెక్షన్‌లను తొలగించాలని ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో కనీసం అందులోంచి తమ బకాయిలను రాబట్టేందుకు ఆశాఖ అధికారులు నడుం బిగించారు. గ్రామ తాగునీటి అవసరాలు తీర్చే విద్యుత్‌ మోటార్ల బకాయిలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీధిలైట్లు, నీటి పథకాల విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే పలుమార్లు పంచాయతీ శాఖ అధికారులకు, సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేశారు.

బకాయి వసూళ్లకు స్పెషల్‌ డ్రైవ్‌
డివిజన్‌లో విద్యుత్‌ బకా యిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మండలాల ఎంపీడీఓలు, సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. బకాయిలు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మండల శాఖా« దికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో వ్వవహరించి పెండింగ్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది.–భాస్కర్‌నాయుడు, ట్రాన్స్‌కో డీఈ, మదనపల్లె

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?