amp pages | Sakshi

కొత్త పోలీసు చట్టం సిద్ధం

Published on Mon, 09/23/2013 - 02:54

సాక్షి, హైదరాబాద్: పోలీసు సంస్కరణలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త పోలీసు చట్టం రూపకల్పన పూర్తయింది. మొత్తం 8 చాప్టర్లు, 121 ఉప చాప్టర్లతో సుమారు 150 పేజీలున్న ‘పోలీసు యాక్టు-2013’ను పోలీసుశాఖ సిద్ధం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసు సంస్కరణలన్నింటికీ చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ముసాయిదా ప్రతిని ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న మూడు పోలీసు చట్టాలను కలిపి ఒకే పోలీసు చట్టాన్ని రూపొందిం చారు. ప్రస్తుతం  రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీసు చట్టం, తెలంగాణ పోలీసు చట్టం, హైదరాబాద్ పోలీసు చట్టం.. మూడూ భారత పోలీసు చట్టం 1861కు లోబడే ఉంటాయి. అయితే తాజాగా కేర ళ పోలీసు యాక్టు 2011 ప్రాతిపదికగా రాష్ట్ర పోలీసు చట్టానికి రూపకల్పన చేశారు.
 
 డీజీపీగా నియమితులైనవారు ఖచ్చితంగా రెండేళ్లపాటు ఆ స్థానంలో కొనసాగేవిధంగా చట్టంలో పొందుపరిచారు. జిల్లా ఎస్పీ, శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)లను రెండేళ్ల తరువాతే బదిలీ చేయాలని పేర్కొన్నారు. తీవ్రమైన ఆరోపణలు, అసమర్ధత ప్రాతిపదికగా మాత్రమే రెండేళ్లకన్నా ముందుగా వారిని బదిలీచేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు/సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి చైర్మన్‌గా పోలీసు ఫిర్యాదుల విభాగం (పీసీఏ)ను కూడా చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయి విభాగంలో రిటైర్డు జిల్లా జడ్జి చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో పీసీఏను ఏర్పాటుచేస్తారు. హత్య, అత్యాచారం, అధికార దుర్వినియోగం, బలవంతపు వసూళ్లు, భూ ఆక్రమణలు వంటి నేరాలకు పాల్పడిన పోలీసులపై పీసీఏ విచారణ జరుపుతుంది. ఆరోపణలు నిర్ధారణ అయితే ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ర్ట హోంమంత్రి చైర్మన్‌గా ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు ఐదుగురు స్వతంత్ర సభ్యులతో ఇప్పటికే ఏర్పాటు చేసిన రాష్ట్ర భద్రతా కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)కు పోలీసు చట్టంలో స్థానం కల్పించారు.
 
 పోలీసుశాఖలో బదిలీలు, పదోన్నతులన్నీ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు ద్వారా జరిగే విధంగా చట్టంలో పొందుపరిచారు. సమాజభద్రత విషయంలో ప్రజలను కూడా భాగస్వాములను చేసేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్‌కు కొత్త చట్టంలో ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాలు, వార్డుల వారీగా ప్రజలతో కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను రూపొందించారు. తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం నియమిస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్(ఎస్పీవో)ల నియామకానికి సంబంధించి కూడా ఖచ్చితమైన మార్గదర్శకాలను పొందుపరిచారు. పోలీసు నూతన చట్టం ముసాయిదా బిల్లును ప్రభుత్వం శాసనసభ ఆమోదానికి పంపనుంది. అసెంబ్లీలో బిల్లుపెట్టే పరిస్థితి ప్రస్తుతం లేకుంటే ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తారని సమాచారం.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)