amp pages | Sakshi

పులిచింతల నిర్వాసితుల ఆక్రోశం

Published on Sat, 09/27/2014 - 00:29

 రాజుపాలెం
 తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఆరునెలల నుంచి అల్లాడిపోతుంటే పట్టించుకునే నాథుడే లేడని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడకు వచ్చారని పులిచింతల ప్రాజెక్టు నిర్వాసిత కేంద్రాల ప్రజలు అధికారులపై మండిపడ్డారు. సరస్వం కోల్పోయి అనాథల్లా ఇక్కడ ఉంటున్నామని వాపోయారు.
 మండలంలో ఉన్న మూడు పునరావాస కేంద్రాలలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులపై శుక్రవారం చౌటపాపాయపాలెంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ సమక్షంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
     తొలుత జేసీ ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ సరఫరా, శ్మశాన వాటి కలపై సమీక్ష చేశారు. వీటిపైనే మాట్లాడాలని నిర్వాసితులను జేసీ ఆదేశించారు. ఈ సందర్భగా నిర్వాసితులు తమ ఆవేదనను వెలిబుచ్చారు.
     ‘మీరు ఉన్నప్పుడే అధికారులు రెండు, మూడు రోజుల్లో  అనీ చేస్తామని సమాధానం చెబుతారు, ఆ తరువాత కంటికి కూడా కనపడరని’అధికారుల వైఖరిని బయటపెట్టారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతున్నామన్నారు.
     పునరావాస కేంద్రాల్లో ఆరు నెలల నుంచి  వీధి దీపాలు వెలగడం లేదని , పంచాయతీ అధికారులను అడిగితే తమ వద్ద నిధులు లేవని చెబుతున్నారని ఆవేశంగా అన్నారు.
     సుమారు మూడువేల కుటుంబాలు తరలివస్తే ఇప్పటివరకు శ్మశానానికి స్థల సేకరణ చేయలేదని మండిపడ్డారు.
     అనంతరం జేసీ మాట్లాడుతూ వారానికొకసారి కేంద్రాలను సందర్శించడానికి, ఇక్కడి సమస్యలను తీర్చడానికి ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు హామీ ఇవ్వడంతో నిర్వాసితులు శాంతించారు.
     ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ద్వారా స్వచ్ఛందంగా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు క్యాంప్‌లు ఏర్పాటు చేయనున్నట్టు కూడా జేసీ  తెలిపారు.
 ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ ఢిల్లీరావు, ఆర్డీవో భాస్కరనాయుడు, ఎస్‌డీసీ-2 వేణుగోపాలరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాణి, డీపీవో గ్లోరియా, హౌసింగ్ పీడీ సురేష్‌బాబు, విద్యుత్ ఏడీ జి.సుందరబాబు, ఎస్‌డీసీ-1 ఝన్సీరాణి, ఆర్‌డబ్లూఎస్ ఈఈ వేణు, తహశీల్దారు నాగూల్‌సింగ్, ఎంపీడీవో భ్రమరాంబ, ఐసీడీసీ ప్రాజెక్టు అధికారి మాధురి, ఐకేపీ ఏపీఎం సునీత, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసరావు, అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ, పిడుగురాళ్ల ,దాచేపల్లి తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.



 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)