amp pages | Sakshi

పనులకు బోణీ ఎలాగ?

Published on Sat, 02/14/2015 - 02:41

వివిధశాఖల్లో అధికారుల మీమాంస
పాలనానుమతులు ఉన్నా తొలగని సందిగ్ధం
అవసరమైన నిధుల రాకపై తర్జనభర్జన
అందుకే టెండర్లు పిలవడంలో జాప్యం


సాక్షి, రాజమండ్రి : జిల్లాలో పుష్కరాల పనులు ఇంకా ఊపందుకోలేదు. ఇరిగేషన్ శాఖ అక్కడక్కడా ఘాట్‌ల మరమ్మతులు ప్రారంభించినా ఇంకా ఆర్‌అండ్‌బీ, దేవాదాయశాఖ, రాజమండ్రి నగర పాలక సంస్థల్లో కీలక పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రభుత్వం ఈ శాఖలు చేపట్టే పనులకు పరిపాలనాపరమైన అనుమతులు ఇస్తూ నెలన్నర క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ పనుల ప్రారంభంలో మాత్రం తీవ్రజాప్యం జరుగుతోంది.

టెండర్లు పిలిచి పనులు చేపడితే ఆనక నిధులు రాకపోతే పరిస్థితి ఏమిటని అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు జీఓలు విడుదలైన పనుల్లో కూడా సాధికారిత కమిటీ మార్పులు చేస్తుండడంతో మార్పు చేసిన పనులకు సరైన ఉత్తర్వుల్లేకుండా ఎలా ప్రారంభించాలో తెలియక సందిగ్ధంలో ఉన్నారు. ప్రధానంగా ఈ పరిస్థితి నీటిపారుదల, దేవాదాయ శాఖల్లో కనిపిస్తోంది.
 
ఇలా ప్రారంభం కావాలి..
 
పనులకు సంబంధించి అధికారులు అంచనాలు పంపిస్తే వాటి ఆధారంగా ప్రభుత్వం ముందుగా పరిపాలనాపరమైన ఆమోదం ఇస్తుంది. ఇలా ఉత్తర్వులు వెలువడ్డాక ఆయా శాఖల అధికారులు తుది అంచనాలు సమర్పిస్తారు. వీటికి సాంకేతిక అనుమతులు ప్రభుత్వం నుంచి వచ్చాక టెండర్లు పిలుస్తారు. పనులు పూర్తయ్యాక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. ప్రస్తుతం పుష్కర పనుల్లో సు మారు రూ.384 కోట్ల వరకూ వివిధ శాఖలకు పరిపాలనాపరమైన అనుమతులున్నా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడంలో అధికారులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.

అన్ని శాఖల పనుల్లో మార్పులు..

నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, దేవాదాయ తదితర శాఖలు ముందుగా అంచనాలు సమర్పించిన పనుల్లో ప్రస్తుతం సాధికారిత కమిటీ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖ మొదట్లో సుమారు రూ.65 కోట్ల విలువైన పనులను ప్రతిపాదించింది. కానీ ఆ శాఖకు రూ.14.25 కోట్ల మేరకే పరిపాలనాపరమైన అనుమతులు వచ్చాయి.

కాగా  నిర్మాణ పరమైన పనులు వద్దని, కేవలం దేవాలయాల్లో సుందరీకరణ, రంగులు,సున్నాలు వేసే పనులు మాత్రమే చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ ఆదేశించారు. దీంతో ఆ శాఖ కేవలం రూ.ఎనిమిది కోట్లతో పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత అంచనాల్లో మార్పులు ఉన్నందున ఈ పనులపై స్పష్టమైనఆదేశాల కోసం ఆ శాఖ అధికారులు వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖలో కూడా పనుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.

నగరపాలక సంస్థలోనూ అదే పరిస్థితి

రాజమండ్రి నగరపాలక సంస్థకు పుష్కర ఏర్పాట్లకు పురపాలక శాఖ రూ.240 కోట్ల మేర పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ మొత్తా న్ని 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సంగ్రహిం చాలని సూచించింది. ఆర్థిక సంఘం నిధులు అం త ఎక్కువ మొత్తంలో లేక పోవడం, పుష్కరాల ఏ ర్పాట్లకు ఈ నిధులు వాడవచ్చా, లేదా అన్న స్ప ష్టత లేకపోవడంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యం అ వుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ టెండర్లు పిలిచి ప నులు ప్రారంభిస్తే తర్వాత డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. సాధికారిత కమిటీ మాత్రం ప్రభుత్వం జీఓ ఇచ్చింది కదా ఏదోరకంగా నిధులు వస్తాయని సర్దిచెబుతోంది. స్పష్టత లేకుండా లేకుండా నిధులు వెచ్చిస్తే తర్వాత ఆడిట్ అభ్యంతరాలు వస్తే మొదటికే మోసం వస్తుందని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)