amp pages | Sakshi

క్వారంటైన్‌ కేంద్రం ఎలా ఉంటుందంటే..

Published on Sun, 03/29/2020 - 12:42

సాక్షి, ఎచ్చెర్ల: కరోనా నేపథ్యంలో పరిశీలన కోసం క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచిన వారికి అధికార యంత్రాంగం సకల సదుపాయాలు కల్పిస్తోంది. ప్రతి వారినీ విడివిడి గదుల్లో ఉంచుతారు. ప్రతి గదిలో మంచం, డస్ట్‌ బిన్, వైఫై సౌకర్యం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. భోజనం, అల్పాహారం, స్నాక్స్‌ వంటివి ఇచ్చే ముందు మైకుల్లో అధికారులు అనౌన్స్‌ చేస్తారు. గది ముందు ఉంచితే వీరు తీసుకోవల్సి ఉంటుంది. ఉద యం టీ, అల్పాహారంగా రాగీ మాల్ట్, ఉడికించిన గుడ్డు, అనంతరం ప్రూట్‌ సలాడ్, లంచ్‌కు శాకాహార, మాంసాహార భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్, రాత్రి డిన్నర్‌కి రైస్, వెజ్‌ కర్రీలు అందజేస్తున్నారు. (కరోనాపై పోరు: సీఎం జగన్‌ బాటలో కేరళ, బ్రిటన్‌)

ట్రిపుల్‌ ఐటీ క్వారంటైన్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన బెడ్‌ 

రెవెన్యూ అధికారులు భోజనం ఏర్పాట్లు, పంచాయతీరాజ్‌ అధికారులు పారిశుద్ధ్యం పర్యవేక్షిస్తుండగా.. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 24 గంటలపాటు రౌండ్‌ ది క్లాక్‌ వైద్యసేవలు అందిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో వైద్య బృందాలు పనిచేస్తున్నాయి. పోలీసులు 24 గంటలు గస్తీ కాస్తున్నారు. ఈ కేంద్రాలను శ్రీకాకుళం ఆర్డీవో ఎంవీ రమణ, తహసీల్దార్‌ సనపల సుధాసాగర్, ఎంపీడీవో ఎం.పావని, పంచాయతీ అధికారి కె.ఈశ్వరి, మండల గణాంక అధికారి వి.శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.  
సన్నాహాలు చేస్తున్నారు. (భయం వద్దు.. మనోబలమే మందు)


క్వారంటైన్‌ సెంటర్‌లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ 

ట్రిపుల్‌ ఐటీ సిద్ధం 
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న క్వారంటైన్‌ సెంటర్‌ దాదాపు నిండిపోవడంతో ట్రిపుల్‌ ఐటీని సిద్ధం చేశారు. వర్సిటీ కేంద్రంలో 78 గదులు ఉండగా.. ప్రస్తుతం 63మంది ఉన్నారు. దీంతో ఎస్‌ఎం పురంలోని రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్‌ ఐటీ)లో 150 ప్రత్యేక గదులు సిద్ధం చేశారు. 135 మందిని ఈ కేంద్రానికి తరలించే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికి ఎనిమిదిమందిని తరలించారు. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొవ్వూరు, రాజమండ్రి, శ్రీసిటీ వంటి ప్రాంతాల్లో ఉపాధి కోసం వెళ్లిన జిల్లాకు చెందిన వలస కార్మికులను ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ కేంద్రానికి ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. (రేషన్‌ పంపిణీతో ఏపీ ప్రజలకు ఊరట)


సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ 

గతంలో విదేశాల నుంచి వచ్చిన వారిని మాత్రమే క్వారంటైన్‌ సెంట ర్లలో ఉంచగా, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారిని సైతం కేంద్రాల్లో ఉంచాలని కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  ఇదికాక ప్రత్యేక గదులు ఉన్న విద్యా సంస్థలపై అధికారులు దృష్టి పెట్టారు. సింగిపురంలో మూతపడ్డ వైష్ణవి కళాశాలలో 50మంది, వెన్నిలవలస నవోదయ పాఠశాలలో 80మంది, ఐతం ఇంజినీరింగ్‌ కళాశాలలో 150మంది, నరసన్నపేటలో 12మంది సామర్ధ్యం గల ప్రభుత్వ వసతి గృహాల్లో ప్రస్తుతం క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. (కరోనా వైరస్‌తో స్పెయిన్‌ యువరాణి మృతి)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌