amp pages | Sakshi

నాటా కొత్త అధ్యక్షుడిగా డాక్టర్‌ రాఘవరెడ్డి

Published on Mon, 01/28/2019 - 02:52

సాక్షి, అమరావతి: ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాటా) నూతన అధ్యక్షుడిగా డాక్టర్‌ రాఘవరెడ్డి గోశాల బాధ్యతలు చేపట్టారు. కొత్తగా ఎన్నికైన నాటా కార్యవర్గ సభ్యులతో నాటా అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమసాగర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త కమిటీలో రాఘవరెడ్డితోపాటు కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, బాలా ఇందుర్తి, ఆళ్ల రామిరెడ్డి, గండ్ర నారాయణరెడ్డి, సోమ వరపు శ్రీనివాసులురెడ్డి, శివ మేక, గంగసాని రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి కొట్లూరు, రమణారెడ్డి క్రిస్టపాటి, కోటిరెడ్డి బుర్ల, శ్రీనివాస్‌రెడ్డి కానుగంటి, పెనుమాడ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.  

డాక్టర్‌ రాఘవరెడ్డి గోశాల ప్రస్థానం.. 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కొండమీది కొండూరు గ్రామంలో రైతు కుటుంబంలో రాఘవరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన ఉన్నత విద్యకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకొన్నారు.  వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ద్వారా ఏటా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. నాటా ద్వారా అమెరికాలోని తెలుగువాళ్లకే కాకుండా ఏపీ, తెలంగాణల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాఘవరెడ్డి నాటా అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఆయన స్వగ్రామంలో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఏటా సొంత ఊరికి వచ్చి అందరి క్షేమ సమాచారాలు తెలుసుకుంటారని, ఎవరు ఎలాంటి సహాయం అడిగినా కాదనకుండా చేస్తారని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌