amp pages | Sakshi

రెడ్ మార్క్ !

Published on Sat, 09/27/2014 - 00:12

సాక్షి ప్రతినిధి,గుంటూరు :
 నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలో ప్రభుత్వ భూముల వివరాలతోపాటు కొందరు రియల్టర్ల అక్రమాలూ వెలుగులోకి వస్తున్నాయి.  చెరువులు, అసైన్డ్‌భూములను కొందరు ఆక్రమిస్తే, సామాజిక స్థలాలను మరి కొందరు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న భూముల సర్వేలో ఇవన్నీ వెలుగులోకి వస్తుండటంతో అక్రమార్కుల వెన్నులో చలిపుడుతోంది.
     ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే’ రీతిలో ఇరవై ఏళ్ల నాటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
     ఈ స్థలాల జాబితాను రూపొందించిన రెవెన్యూ శాఖ వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించడంతో అప్పటి కొనుగోలుదారులు పూర్తిగా నష్టపోతున్నారు.
     వీరంతా అప్పట్లో 200 చదరపు గజాల స్థలాన్ని రూ. ఆరు వేల నుంచి 60 వేలకు కొనుగోలు చేసినా, ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని రియల్టర్లపై ఒత్తిడి చేస్తున్నారు.
 అప్పట్లోనే రియల్ భూమ్..
     రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల కంటే గుంటూరు జిల్లాలో ఇరవై సంవత్సరాల కిందట రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికంగా జరిగింది.
     వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేసిన కొన్ని ప్రముఖ కంపెనీలు స్థలాలు విక్రయించాయి.
     ఆ సమయంలో తమ వ్యవసాయ భూములకు సరిహద్దునే ఉన్న  చెరువులు, అసైన్డ్‌ల్యాండ్స్‌ను కలుపుకుని వెంచర్లు వేశాయి.
     ఈ లేఅవుట్లకు వీజీటీఎం ఉడా అనుమతి ఇవ్వడంతో స్థలాలు వేగంగానే అమ్ముడు పోయాయి. ఇలా అనుమతి ఇచ్చిన లే అవుట్లోని సామాజిక స్థలాలనూ కొందరు రియల్టర్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
     గుంటూరుకు సమీపంలోని పెదకాకాని, కాజ, మంగళగిరి, తెనాలిలో ఈ తరహా స్థలాల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి.
     రాజధానికి నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలో ఆక్రమణకు గురైన చెరువులు, అసైన్డ్ భూముల వివరాలను రెవెన్యూశాఖ సేకరించింది.  వీటిల్లో వేసిన వెంచర్లకు సంబంధించిన స్థలాలపై రెడ్ మార్కు పెట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయకూడదని నిషేధం విధించింది.
     మరో వైపు అక్రమ లేఅవుట్లపై వీజీటీఎం ఉడా దృష్టి సారించింది. ఒక్క తెనాలి, గుంటూరు డివిజన్‌లలో సుమారు 12 వేల అనధికార లే ుట్లను గుర్తించి వాటి వివరాలను రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అందజేసింది. దీంతో ఈ స్థలాలను కొత్తగా ఎవరైనా కొనుగోలు చేసినా, వాటి రిజిస్ట్రేషన్లు మాత్రం జరగడం లేదు. వీటిని అమ్మిన ప్రముఖ కంపెనీలు, రియల్టర్లపై కొనుగోలుదారుల ఒత్తిడి పెరిగింది. కొందరిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిరా్యాదు చేస్తున్నారు.


 

Videos

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం

సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం

జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్

కళ్యాణదుర్గం బహిరంగ సభలో సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

కర్నూలు బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముఖ్యాంశాలు

ఆ గ్యాంగ్ ను ఏకిపారేసిన వల్లభనేని వంశీ

Watch Live: కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ప్రచార సభ

పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..

చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)