amp pages | Sakshi

జూలైలో పుష్కరనీరు విడుదల చేయాలి

Published on Sun, 06/15/2014 - 01:05

జగ్గంపేట : మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలను అందించే పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా జూలై మొదటి వారం నుంచే రైతులకు సాగునీరు విడుదల చేయాలని పుష్కర ఇరిగేషన్ అధికారులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. పుష్కర పథకం సాగునీరు అందించడంలో ఏర్పడే సమస్యలు, వాటి పరిష్కారం తదితర అంశాలపై శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్యోతుల మాట్లాడుతూ పుష్కర పథకం ద్వారా మూడేళ్లుగా ఖరీఫ్‌లో రైతులకు నీరు సరఫరా చేస్తున్నా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు.

మొత్తం 1,86,000 ఎకరాలకు నీరు అందించేందుకు రూపొందించిన ఈ పథకం ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో 59 వేల ఎకరాలకు నీరు రావాలన్నారు. అయితే 20 వేల ఎకరాలకు నీరందే పరిస్థితి నెలకొందన్నారు. కాలువల్లో పూడిక తీయడానికి సమయం లేనందున ఉపాధి పథకం ద్వారా వీలైనంత త్వరగా చిన్న చిన్న కాలువలను శుభ్రపరచాలన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం క్షేత్రస్థాయిలో కాలువల పరిశీలన చేద్దామన్నారు.

జగ్గంపేట, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలాల నుంచి వచ్చిన రైతులు సమీక్షలో పుష్కర సమస్యలను ఎమ్మెల్యే, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి ధవళేశ్వరం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు అత్తులూరి సాయిబాబు, డీఈఈలు రామచంద్రరావు, శ్రీరామచంద్రమూర్తి, ప్రశాంత్ బాబు, హోలిపుల, జేఈ మనోహర్ చంద్రశేఖర్, ఇన్‌చార్జి ఎంపీడీఓ నరసింగరావు, జగ్గంపేట సర్పంచ్ ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)