amp pages | Sakshi

కర్నూలు హైవేపై ఘోర ప్రమాదం

Published on Sun, 05/13/2018 - 19:07

సాక్షి, కర్నూలు : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్‌ ఎస్‌.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్‌ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు పంక్చర్‌ అయ్యింది. దీంతో అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ ప్రొఫెసర్‌ ప్రయాణిస్తున్న కారుని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రొఫెసర్, అతని భార్య, డ్రైవర్‌లు అక్కడికక్కడే మృతి చెందగా..ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న కార్తీక్, తేజేష్, రాకేష్, శేఖర్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కాగా, మృతుడు శివభూషణానికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  

Videos

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)