amp pages | Sakshi

బంగారం దుకాణంలో చోరీ

Published on Mon, 11/17/2014 - 01:32

గిద్దలూరు : బంగారం దుకాణంలో దొంగలు పడి రూ.6 లక్షల విలువైన ఆభరణాలు అపహ రించిన ఘటన స్థానిక వైశ్యాబ్యాంకు రోడ్డులో ఆదివారం రాత్రి జరిగింది. దుకాణం యజమాని, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జీవన్ జ్యుయలరీ దుకాణం యజమాని పీ వెంకటరమణ అందులోనే నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి దుకాణం ముందు ఉన్న ఇనుప గ్రిల్ గేటుకు తాళం వేసి..లోపల ఉన్న షట్టర్‌ను కిందకు దించి తాళం వేయలేదు. గమనించిన దొంగలు గ్రిల్‌కు వేసిన తాళం తొలగించి, దుకాణంలోకి ప్రవేశించి అందులోని ఆరు నక్లెస్‌లు, ఆరు కేజీల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. వాటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని దుకాణం యజమాని వెంకటరమణ తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
పరిశీలించిన ఓఎస్డీ, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ అధికారులు:

చోరీకి గురైన దుకాణాన్ని మార్కాపురం ఓఎస్డీ సమైజాన్‌రావ్, సీఐ నిమ్మగడ్డ రామారావు, ఎస్సై ఎం.రాజేష్  పరిశీలించారు. చోరీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గృహంలో ఉండగానే దుకాణంలోని ఆభరణాలు చోరీకి గురవడమేంటని వారు ప్రశ్నించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డాగ్ స్క్వాడ్ రూబీ  కౌంటరు వద్ద దొంగలు వదిలివెళ్లిన సుత్తి, ఇనుప రాడ్లను పరిశీలించి, అక్కడే నివాసం ఉంటున్న యజమాని వద్ద, స్నానం గది, బెడ్ రూం వద్దకు వెళ్లింది. ఆ తర్వాత బయటకు వచ్చిన డాగ్ వీధిలోని రెండు చివరలకు వెళ్లి ఆగి, తిరిగి దుకాణం వద్దకు చేరుకుంది. మరో పర్యాయం గృహంలోకి వెళ్లి మొరిగింది.  క్లూస్ టీం సీఐ రాజు, తన సిబ్బందితో కలిసి వేలిముద్రలు, ఆధారాలను సేకరించారు.

చోరీ జరిగిన తీరుపై అనుమానాలు:
జీవన్ జ్యుయలరీ షాపులో దొంగలు పడి ఆభరణాలు చోరీ చేసిన సంఘటనను పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే ప్రాంతంలో 15 వరకు నగల దుకాణాలున్నాయి. అవన్నీ వదిలేసి దుకాణంలోనే నివాసం ఉంటున్న చోట దొంగ లు చోరీకి పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. విలువైన ఆభరణాలు ఉన్న దుకాణానికి కేవలం గ్రిల్స్‌కు తాళం వేసి న యజమాని,షట్టరుకు తాళం వేయలేదని చెప్పడాన్ని కూడా పోలీసులు సందేహిస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకునే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)