amp pages | Sakshi

అందరూ నీలాగే మాట తప్పుతారని భావిస్తే ఎలా?

Published on Sat, 05/30/2020 - 10:16

సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్‌ జగన్‌ పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర పార్టీకార్యాలయం వద్ద ఘనంగా వేడుకలను నిర్వహించారు. సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కావడంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించి, దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర గతిని మార్చి నేటికి ఏడాదయ్యింది. రాష్ట్ర స్వరూపాన్ని సీఎం జగన్‌ మార్చేశారు. భావితరాలు మెచ్చే విధంగా ఏడాది పాలన సాగింది. మేనిఫెస్టోలో పెట్టిన 90శాతం హామీలను అమలు చేశారు. ప్రజలు జగన్‌మోహన్‌ రెడ్డి మీద నమ్మకాన్ని నిలబెట్టారు. చదవండి: రైతు ముంగిటకే సమస్త సేవలు

సీఎం జగన్‌ విజన్‌ ఉన్న నేత. సంక్షేమం అనేది వైఎస్సార్‌‌ కుటుంబానికే సాధ్యం. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా జగన్‌ తన ఏడాది పాలనలో ప్రజలకు అందించారు. చంద్రబాబులా ఇచ్చిన మాట తప్పడం జగన్‌కు అలవాటు లేదు. చంద్రబాబు గురించి ప్రజలు మర్చిపోయారు. సీఎంపై విమర్శలు చేసేందుకే మహానాడు పెట్టారు. ప్రజలకు పనికొచ్చే ఒక్క తీర్మానం చేయకుండానే మహానాడును ముగించారు. జగన్‌మోహన్‌ రెడ్డి హామీలు అమలు చేయలేరని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. కానీ పదవి చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను దాదాపుగా అమలు చేసి చూపించారు. చంద్రబాబు తనలాగే అందరూ మాట తప్పుతారని భావిస్తాడు. కానీ జగన్‌ మాట ఇస్తే అమలు చేసి చూపిస్తాడు. చదవండి: ‘పదవి పోయాక బీసీలపై చంద్రబాబు కపట ప్రేమ’

కరోనా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కార్పొరేట్‌ వ్యవస్థకు దీటుగా విద్య, వైద్య రంగాన్ని తీర్చిదిద్దుతున్నారు. సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. చరిత్ర గతిని మారుస్తున్న నాయకుడు సీఎం జగన్‌. ఏడాది పాలన, అందించిన సంక్షేమ కార్యక్రమాలపై గత ఐదు రోజులుగా సమీక్షలు జరిపారు. నిపుణలు, లబ్ధిదారులు నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. రానున్న రోజుల్లో మరింత అకుంఠిత దీక్షతో పాలన కొనసాగిస్తారని' సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చదవండి: చరిత్ర గతిని మార్చి నవశకాన్ని లిఖించి..

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)